Advertisementt

బాలీవుడ్‌కి ‘నో’: స్టార్ హీరోయిన్

Sat 16th Mar 2019 05:49 PM
star heroine,nayanthara,bollywood,no  బాలీవుడ్‌కి ‘నో’: స్టార్ హీరోయిన్
Star Heroine Says No to Bollywood బాలీవుడ్‌కి ‘నో’: స్టార్ హీరోయిన్
Advertisement
Ads by CJ

చాలామంది హీరోయిన్స్ కి సౌత్ లో బాగా క్రేజ్ వచ్చేసాక.. ఇక వారి చూపంతా బాలీవుడ్ మీదే ఉంటుంది. ఎప్పుడెప్పుడు బాలీవుడ్ ఛాన్స్ వస్తుందా.... బాలీవుడ్ కి చెక్కేద్దామా అన్నట్టుగా ఉంటారు. ఆ లిస్ట్ లో బోలెడుమంది సౌత్ హీరోయిన్స్ ఉన్నారు కూడా. అందులో ఇలియానా, తాప్సి లాంటి వాళ్లయితే అక్కడే సెటిల్ కూడా అయ్యారు. కాజల్, తమన్నా లాంటి వాళ్ళు అదృష్టాన్ని పరీక్షించుకుని వెనక్కి తిరిగారు. అయినా వాళ్ళకి ఎక్కడో చిన్న ఆశ. బాలీవుడ్ ఛాన్స్ రాకపోతుందా.. అక్కడ సెటిల్ అవకపోతామా అని.

కానీ ఒక స్టార్ హీరో హీరోయిన్ మాత్రం బాలీవుడ్ వెళ్లే ఆలోచనే కాదు.... అసలు ఆసక్తి కూడా లేదంటుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార. తమిళంలోనూ, తెలుగులోనూ సూపర్ హిట్ సినిమాల్తో దూసుకుపోతూ క్షణం తీరికలేకుండా ఉన్న నయనాకి బాలీవుడ్ నుండి బోలెడన్ని అవకాశాలు వచ్చాయట. కానీ ఎంత క్రేజున్న సినిమా అయినా నయనతార నో చెప్పేస్తుంది. మరి నో చెప్పక ఏం చేస్తుంది. ఒకటో రెండో బాలీవుడ్ సినిమాల్లో నటించి సౌత్ అవకాశాలు పోగొట్టుకోలేదు కదా. అసలే లేడి ఓరియెంటెడ్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు, యంగ్ హీరోల సినిమాలు అంటూ ఒక చుట్టు చుడుతున్న నయనతార బాలీవుడ్ కి వెళితే.. ఇన్ని ఆఫర్స్ ఉంటాయా.. అందుకే బాలీవుడ్ మీద ఏమాత్రం మోజు పడడం లేదు ఈ హీరోయిన్.

రీసెంట్ గా ఒక బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ తాము తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కోసం నయనతారని సంప్రదించారట. అయితే నయనతార ఆ నిర్మాతకి నో చెప్పినా.. ఆయన మాత్రం జిడ్డులా నయనతారని వదలలేదట. అయినా నయనతార ఆయన్ని పట్టించుకోకపోయేసరికి.. ఇక ఆ నిర్మాత చేసేది లేక మరో బాలీవుడ్ హీరోయిన్ తో ఆ సినిమా కానిచ్చేస్తున్నాడట. మరి సౌత్ లో టాప్ హీరోయిన్ గా వున్న తనకి బాలీవుడ్ సినిమాల మీద ఆసక్తి లేదని నయనతార చెప్పడం మాత్రం ఆసక్తిని కలిగిస్తుంది.

Star Heroine Says No to Bollywood:

Nayanthara about Bollywood Entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ