Advertisementt

RRR: రిలీజ్ డేట్ ప్రకటించేశారోచ్

Thu 14th Mar 2019 06:44 PM
rajamouli,rrr,ram charan,jr ntr,release date,alluri seetharama raju,komaram bheem  RRR: రిలీజ్ డేట్ ప్రకటించేశారోచ్
RRR Release Date Fixed RRR: రిలీజ్ డేట్ ప్రకటించేశారోచ్
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న RRR సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటివరకు RRR సినిమా గురించిన సమాచారమేమి మీడియాకి ఇవ్వని రాజమౌళి.. మొదటిసారి RRR కి సంబందించిన మీడియా సమావేశాన్ని హైదరాబాద్ లోని... పార్క్ హయ్యత్ లో ఏర్పాటు చేసాడు. RRR ప్రెస్ మీట్ లో రాజమౌళి ఏం చెబుతాడో.. RRR లో నటిస్తున్న హీరోల లుక్స్ ఎలా ఉంటాయో అనే క్యూరియాసిటీతో యావత్ భారతదేశం ఈ RRR ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఎదురు చూస్తుంది.

అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన RRR మీడియా సమావేశంలో రాజమౌళి RRR  పై ఏం చెబుతాడో అనే క్యూరియాసిటీకి మెల్లమెల్లగా తెరపడ్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న RRR గత ఏడాది నవంబర్ లో మొదలైంది. అయితే ఇప్పుడు ఈ మీడియా సమావేశంలో రాజమౌళి RRR విడుదలపై క్లారిటీ ఇచ్చేసాడు. RRR సినిమా వచ్చే ఏడాది అంటే 2020 జూలై 30 న విడుదల చేస్తామని చెప్పేసాడు. నిర్మాత దానయ్య భారీ గా నిర్మిస్తున్న RRR మూవీ నేషనల్ వైడ్ గా పలు భాషల్లో విడుదల చేస్తున్నట్లుగా రాజమౌళి RRR ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసాడు. ఇంకా ఈ ప్రెస్ మీట్ లో RRR హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, జక్కన్న, రామా రాజమౌళి.. రాజమౌళి కోడలు పూజ, కీరవాణి భార్య వల్లి పాల్గొన్నారు. RRR మరిన్ని అప్ డేట్స్ కోసం వెయిట్ అండ్ వాచ్.

RRR Release Date Fixed:

RRR Update: Rajamouli Announced Release Date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ