రాజమౌళి సినిమాల విషయంలో చెక్కిందే చెక్కినా.. అవుట్ ఫుట్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు చెక్కుతూనే ఉంటాడు. అందుకే జక్కన్న తెరకెక్కించే సినిమాలన్నీ ఓ అపురూప కళాఖండాలే. ఇక జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సెట్స్ విషయంలో కానీ.... సినిమాని తెరకెక్కించిన విషయంలో కానీ ఆయనని పొగడని వారు లేరు. అందుకే సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అమరావతి నిర్మాణంలో అలాగే అమరావతిలో కట్టబోయే భవంతుల విషయంలో రాజామౌళి సలహాలు సూచనలు తీసుకున్నాడు కూడా. బాహుబలి తర్వాత రాజమౌళి చాలాసార్లు అమరావతికి వెళ్ళొచ్చాడు కూడా.
అయితే తాజాగా 2019 ఎన్నికల విషయంలో కూడా చంద్రబాబు రాజమౌళి సహాయం తీసుకోవాలని అనుకుని.. రాజమౌళిని సంప్రదించాడట. టిడిపి మల్లీ ఎన్నికల్లో గెలవడానికి గాను.... ప్రభుత్వ పథకాలు ఎలా దోహదం చేశాయో.. యాడ్స్ రూపంలో తెరకెక్కించమని రాజమౌళిని అడగగా... దానిని రాజమౌళి సున్నితంగా తిరస్కరించాడట. తాను భారీ మల్టీస్టారర్ RRR లో బిజీగా ఉండడంతో... ఆ టీడీపీ యాడ్స్ చేయలేనని చెప్పడంతో... ఆ బాధ్యతని బాబు మరో టాలెంటెడ్ డైరెక్టర్ బోయపాటికి ఇచ్చాడట. వినయ విధేయ రామ ప్లాప్ తో ఉన్న బోయపాటి ప్రస్తుతం ఈ టిడిపి యాడ్స్ మేకింగ్ లో బిజీ అయ్యాడు. పార్టి ప్రమోషనల్ యాక్టివిటీస్ ని డైరెక్ట్ చేస్తూ.... అందుకు తగ్గ కంటెంట్ ని రెడీ చేస్తున్నాడు.
అందులోను చంద్రబాబుకి గోదావరి పుష్కరాల నుండి బోయపాటి పరిచయమే. బాలకృష్ణ కి సన్నిహితుడైన బోయపాటి.. మెల్లగా బాబుకి దగ్గరయ్యాడు. ఇక పుష్కరాలపుడు ప్రభుత్వానికి ఫెవర్ గా యాడ్స్ కూడా చేసాడు. ఇక చంద్రబాబుకి రాజమౌళి నో చెప్పగానే ఆ ప్లెస్ లోకి బోయపాటి ని తీసుకోచ్చాడు చంద్రబాబు. తన అసిస్టెంట్స్ తో యాడ్స్ కాన్సెప్ట్ లు ఓకే చేయటం..ప్రమోషనల్ వీడియోలు షూట్ చేయటం చేస్తున్నాడట బోయపాటి. అందుకే అన్నది రాజమౌళి వదిలేస్తే.. బోయపాటి పట్టేసాడు అని.