అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత మరో సినిమా మొదలు పెట్టడానికి దాదాపుగా ఏడాది టైం తీసుకున్నాడు. ఇక అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ సినిమా కోసం దాదాపుగా ఆరు నెలల టైం తీసుకున్నాడు. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబో ఫిక్స్ అయ్యి కూడా నెలలు గడుస్తున్నాయి కానీ.. ఇంతవరకు సినిమా సెట్స్ మీదకెళ్ళలేదు. కారణం బన్నీ మీద నా పేరు సూర్య ఎఫెక్ట్ పడడమే. ఆ డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని.. మరో సినిమాని పక్కాగా సెట్స్ మీదకి తీసుకెళ్లాలని బన్నీ భావించబట్టే... త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా లేట్ అవుతూ వస్తుంది. ఇక మధ్యలో త్రివిక్రమ్ కథ బన్నీకి నచ్చలేదని.. అలాగే ఒక రీమేక్ వీరి కాంబోలో తెరకెక్కుతుందనే న్యూస్ లు సోషల్ మీడియాలో వినబడ్డాయి.
ఇక బన్నీ ఎవరు ఎక్సపెక్ట్ చెయ్యని విషయాన్నీ రివీల్ చేసి అందరికి షాకిచ్చాడు. అదే సుకుమార్ తో అల్లు అర్జున్ సినిమా. త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకెళ్ళకుండానే బన్నీ, సుకుమార్ తో సినిమా కమిట్ అవడం.. అధికారిక ప్రకటన ఇప్పించడము జరిగాయి. అయితే సుకుమార్ తో అల్లు అర్జున్ సినిమా ఆగష్టు నుండి సెట్స్ మీదకెళుతుందంటున్నారు. ఇక మే నుండి త్రివిక్రమ్ సినిమాని అల్లు అర్జున్ పట్టాలెక్కించబోతున్నాడని... ఈ సినిమాకి అల్లు అర్జున్ కేవలం రెండు నెలల డేట్స్ త్రివిక్రమ్ కేటాయించాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకునే త్రివిక్రమ్ సినిమాని మాత్రం తక్కువ సమయంలోనే చుట్టెయ్యడానికి పక్కా ప్లాన్ చేస్తున్నాడట.
ఎప్పుడు నానుస్తూ సినిమాలు చేసే త్రివిక్రమ్ గత రెండు మూడు సినిమాల నుండి కాస్త ఫాస్ట్ ట్రాక్ ఎక్కాడు. ఇక బన్నీతో తెరకెక్కించబోయే ఆ సినిమాని జులై కల్లా షూటింగ్ కంప్లీట్ చేసేసి.. దసరా బరిలో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబో మూవీని విడుదల ప్లాన్ చేస్తున్నారట. మరి రెండే రెండు నెలల టైం షూటింగ్ కి తీసుకుంటున్న త్రివిక్రమ్.. పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం కూల్ గా చేసి ప్రమోషన్స్ ని అదరగొట్టే రేంజ్ లో చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారట. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన మరోమారు పూజ హెగ్డే, కేథరిన్ లు హీరోయిన్స్ గా నటించబోతున్నారని వార్తలొస్తున్నాయి.