Advertisementt

వెంకటలక్ష్మీ భయపెడుతుందంట!!

Wed 13th Mar 2019 05:11 PM
sridhar reddy,where is the venkatalakshmi,interview,raai lakshmi  వెంకటలక్ష్మీ భయపెడుతుందంట!!
Where is the Venkatalakshmi Producer Interview వెంకటలక్ష్మీ భయపెడుతుందంట!!
Advertisement
Ads by CJ

లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’. ప్రముఖ కమెడియన్స్  ప్రవీణ్, మధునందన్.. పూజిత్ పొన్నాడ ముఖ్య పాత్రలు పోషించారు. నూతన దర్శకుడు  కిషోర్ కుమార్ దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి ఎం నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యుబైఏ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రం విడుదలవుతున్న సందర్బంగా నిర్మాత శ్రీధర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. 

ఆయన మాట్లాడుతూ.. ‘‘హర్రర్ కామెడీతో రూపొందించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ చూసే విధంగా ఉంటుంది. అండర్ కరెంట్లో ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది. అది చాలా క్యూరియాసిటీతో ఇంట్రెస్టింగా ఉంటుంది. ఇప్పటివరకు చేయనటువంటి పాత్రలో లక్ష్మీరాయ్ చాలా కొత్తగా కనిపించబోతుంది. అలాగే ప్రవీణ్, మధునందన్, పూజిత పొన్నాడ అద్భుతమైన క్యారెక్టర్స్ లో నటించారు. వారి పాత్రలు సినిమాకి హైలైట్ అవుతాయి. ముఖ్యంగా మా దర్శకుడు కిషోర్ కొత్తవాడైనా ఈ చిత్రాన్ని ఎక్స్‌లెంట్ గా ప్రెజెంట్ చేసాడు. సినిమా టైటిల్ ఎనౌన్స్ నుండి ఇప్పటివరకు మా చిత్రానికి బాగా క్రేజ్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా చూసి సెన్సార్ సభ్యులు అప్రిషియేట్ చేసారు. ముందుగా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైనా క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. మొదటి చిత్రంతోనే మంచి అనుభవం కలిగింది. బయ్యర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారు. బిజినెస్ పరంగా చాలా హ్యాపీగా వున్నాం. ఈ నెలలోనే మా చిత్రాన్ని తెలుగు, తమిళ్ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. తర్వాత ఒక పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి..’’ అన్నారు. 

Where is the Venkatalakshmi Producer Interview :

Producer Sridhar Reddy about Where is the Venkatalakshmi