Advertisement

‘మౌన‌మే ఇష్టం’ ఇంట్రెస్టింగ్ స్టోరీ: కెమెరామెన్

Wed 13th Mar 2019 04:42 PM
mouname ishtam movie,cameraman,ram tulasi,interview  ‘మౌన‌మే ఇష్టం’ ఇంట్రెస్టింగ్ స్టోరీ: కెమెరామెన్
Mouname Ishtam Movie Cameraman Interview ‘మౌన‌మే ఇష్టం’ ఇంట్రెస్టింగ్ స్టోరీ: కెమెరామెన్
Advertisement

రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా ఏకే మూవీస్ ప‌తాకంపై ఆశా అశోక్ నిర్మించిన చిత్రం ‘మౌన‌మే ఇష్టం’. ఆర్ట్ డైరెక్టర్‌గా దాదాపు 150 సినిమాలకు పైగా వర్క్ చేసి 5 నంది అవార్డ్స్ గెలుచుకున్న ప్రముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వివేక్ మహదేవా సంగీతం అందించారు. మార్చి 15 న ఈ సినిమా విడుదల సందర్భంగా కెమెరామెన్ జెడి రామ్ తులసి మీడియాతో ముచ్చటించారు.

ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను ఏడు చిత్రాలకు కెమెరా‌మెన్‌గా వర్క్ చేసాను. వాటిలో నా బంగారు తల్లి, రక్తం చిత్రాలు బాగా గుర్తింపు తెచ్చాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా నా మనసుకి నచ్చిన, నేను కావాలి అనుకొనే వారి చిత్రాలు మాత్రమే ఒప్పుకొని చేస్తున్నాను. నాకు జీవా, పి.సి. శ్రీరామ్ గారు ఇష్టం. నా గురువులు. వారి స్టైల్ లో కాకుండా నా ఓన్ స్టైల్ లో ఫోటోగ్రఫీ చేసి గుర్తింపు తెచ్చుకోవాలని వుంది. స్టార్స్ చిత్రాలకు వారిని అందంగా చూపించి కలర్ఫుల్ గా పిక్చరైజేషన్ చేయాలి. అదే కొత్త కాన్సెప్ట్ లతో వచ్చే చిత్రాలకు మనసు పెట్టి నా ప్రతిభని నిరూపించుకోవచ్చు. అలా అని హార్ట్ ఫిలిం కాకుండా మంచి చిత్రాలు చేయాలని వుంది. ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అశోక్ కుమార్ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి ప్రేమికుడి ప్రేమకు ప్రపోజల్ ఎంతో ముఖ్యమైనది. అలాంటి ప్రేమికుడి ప్రేమకు ప్రపోజల్ ఇబ్బంది అయితే ఆ ప్రేమికుడు పడే బాధ ఎంటో అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. నాకు ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టు లో అవకాశం ఇచ్చినందుకు అశోక్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషం. సురేష్ గారు మంచి డైలాగ్స్ అందించారు. వివేక్ గారు ఇచ్చిన సంగీతాన్ని ఇప్పటికే ప్రతి ఒక్కరు అభినందించారు. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్యూట్ జెండర్ లవ్ స్టొరీ. లవ్  ఎలా ప్రపోజ్ చేయాలన్నదే ఈ సినిమాలో మెయిన్ పాయంట్. ప్రేమించుకునే ఇద్దరు ప్రేమికులు ప్రపోజ్ చేసుకుంటే వారు విడిపోవాల్సిన సందర్భం ఏర్పడితే వారి పరిస్థితి ఏంటి అనే అద్భుతమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ప్రతీ  టెక్నిషియన్ అద్భుతమైన పనితనం కనబరిచారు. సినిమా ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది.  అశోక్ గారు నాకు చాలా చక్కటి సహకారాన్ని అందించారు. ప్రతి ఆర్టిస్ట్ చాలా అనుభవం ఉన్న నటుడిలా నటించారు. సినిమా చాలా బాగుంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది..’’ అన్నారు.

Mouname Ishtam Movie Cameraman Interview:

Mouname Ishtam Movie ready to Release

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement