మెగా కాంపౌండ్ బలమున్నా శివాజీరాజా ఎందుకు ఓడిపోయాడు?. శ్రీరెడ్డి అతనికి ఎందుకు సపోర్ట్‌గా నిలిచింది?. నరేష్ గురించి తెలిసి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది అతనికే ఎందుకు సపోర్ట్ చేశారు?. దీనికి శివాజీరాజా స్వయంకృతమే కారణమా? అంటే పరిశ్రమ వర్గాలు నిజమేనంటున్నాయి. తనకు `మా`లో సభ్యత్వం ఇవ్వడం లేదని ఫిలింనగర్ ప్రాంగణంలో ఆర్థనగ్న ప్రదర్శనకు దిగి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఎంటైర్ ఎపిసోడ్ చిలికి చిలికి పెను ఉప్పెనగా మారి పవన్‌కల్యాణ్ మెడకు చుట్టుకుంది.
ఈ ఎంటైర్ ఎపిసోడ్ జరగడానికి ఆద్యుడు శివాజీరాజా. శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వకపోవడం వల్ల దాన్ని ఎంత వరకు వివాదంగా మార్చాలో అంత మార్చేసిన శ్రీరెడ్డి దాన్ని అడ్డంపెట్టుకుని ఇండస్ట్రీని ఓ ఆటాడుకుంది. ఎంత మందికి బజారుకు ఈడ్చాలో అంత మందిని బజారుకు ఈడ్చింది. ఇక దగ్గుబాటి ఫ్యామిలీనైతే బజార్లో నిలబెట్టినంతపనిచేసింది. అక్కడితో ఆగక ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం పవన్‌ని ఈ ఉచ్చులోకి లాగి నానా బూతులు తిట్టింది. ఇంత జరగడానికి అవకావశం కల్పించడంలో శివాజీరాజా తన వంతు బాధ్యతని తెలియకుండానే తీసేసుకుని ఈ రోజు ఇండస్ట్రీ దృష్టిలో, బడా బాబుల మదిలో బకరా అయిపోయాడు.
ఇదే `మా` ఎన్నికల్లో ఒంటేరుమీద నడకలా సాగాల్సిన శివాజీరాజా గెలుపు బండి గతి తప్పింది. తను చేసిన ఆ తప్పే నరేష్‌ను `మా` అధ్యక్షుడు అయ్యేలా చేసింది. మెగా వర్గానికి కూడా దూరమయ్యాడు. పైకి నవ్వుతున్నా మెగా వర్గం శ్రీరెడ్డి రెచ్చిపోవడానికి శివాజీరాజా చేసిన బ్లెండర్ మిస్టేకే కారణమని మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే వార్ వన్‌సైడ్ గా మారిపోయింది. ఆకులు కాలాక చేతులు పట్టుకుంటే ఏం లాభం. జరిగిందంతా జరిగిపోయాక మంగళవారం శివాజీరాజా మీడియా ముందుకొచ్చి ఎంత చెప్పినా, ఎంత ఏడ్చినా ఎలాంటి ప్రయోజనం వుండదు.