రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ నిజ జీవితంలో ఏదైతే జరిగిందో అది చూపించనున్నారు. సినిమా మొత్తం చంద్రబాబుని నెగటివ్ గా చూపించనున్నాడు వర్మ. వర్మ తనదైన శైలిలో ఈసినిమాను ప్రమోట్ చేస్తున్న ఈసినిమాను కొనడానికి ఎవరు ముందుకు రావడంలేదు.
ట్రైలర్ లో మించి ఏమి ఉండదు అని అర్ధం అయిపోయింది. మొదటిలో క్రేజ్ విపరీతంగా వుండడంతో బయ్యర్లు ఎగబడతారని నిర్మాతలు ఆశించారు కానీ అది జరగకపోవడంతో స్వయంగా రిలీజ్ చేసుకుంటున్నారు మేకర్స్. బయ్యర్లు ఎవ్వరూ రాకుండా కొందరు అడ్డుకుంటున్నారనే టాక్ కూడా నడుస్తోంది. హిందీ చిత్రాలను పంపిణీ చేసే ఎన్‌హెచ్ స్టూడియోస్ లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో తెలుగు సినిమా పంపిణీ రంగంలోకి అడుగు పెడుతున్నారు.
సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన సినిమాకి ఎంత ఖర్చు అయిందో అంత బయటికి వచ్చేస్తుంది. ఒకవేళ ప్లాప్ అయినా పెద్దగా ఇబ్బంది ఏమి లేదు. బ్లాక్ బస్టర్ అయితే ఆ డబ్బంతా ఊరికే పోగొట్టుకోవడం ఎందుకులే అని స్వయంగా విడుదల చేసేస్తున్నారు. మరి ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారో చూడాలి.