బిజెపిని కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా దేశాన్ని ఏలే స్థాయికి తీసుకొచ్చిన ఘనత అద్వానీ, మురళీమనోహర్‌జోషిలది కీలకపాత్ర. కేవలం రెండే సీట్లు ఉన్న పార్టీని దేశాన్ని ఏలే స్థాయికి తీసుకుని రావడంలో వాజ్‌పేయ్, అద్వానీ, జోషిల పాత్రకీలకం. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వాజ్‌పేయ్‌ని మాత్రమే కాదు.. సాక్షాత్తు తన గురువు అయిన అద్వానీని మోదీ తీవ్రంగా అవమానించాడు. అద్వానీ నమస్కారం చేస్తే మోదీ ప్రతినమస్కారం కూడా చేయలేదు. గోద్రా అల్లర్ల నేపధ్యంలోవాజ్‌పేయ్.. మోదీని తొలగించాలని భావిస్తే అద్వానీ మోదీకి మద్దతు తెలిపి ఆయనపై వేటు పడకుండా కాపాడాడు. ఇలా గురువులనే అవమానించిన వారు మోదీ, అమిత్‌షాలు.
ఇక వీరు తమ కంటే సీనియర్ల నుంచి తమకు పోటీ ఎదురు కాకూడదనే ఉద్దేశ్యంతో 75 ఏళ్ల వయసు దాటిని వారికి రిటైర్‌మెంట్ ఇచ్చారు. నిజానికి సీనియర్ల నుంచి తమకు పోటీ కాకుండా ఉండేందుకే మోదీ అండ్ కో ఈ పని చేసింది. సీనియర్లను ఈ వంకతో పక్కనపెట్టడమే కాదు.. కొందరు 75 ఏళ్లు దాటిన మంత్రుల చేత కూడా రాజీనామా చేయించారు. ఈ విషయంలో మోదీ, షాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది నిరంకుశ ధోరణి అని అందరూ వ్యతిరేకించారు. దాంతో వచ్చే ఎన్నికల్లో తమ మీద వచ్చిన విమర్శలను తెలుసుకున్న మోదీ-షాలు ఈసారి మరో కొత్త నిబంధనను తెచ్చారు.
వారు ఈ విషయంలో తీసుకున్ననిర్ణయం ఏమిటంటే.. 75 ఏళ్ల వయసు పైబడిన సీనియర్లు ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులలో ఉండటానికి అనర్హులు. అయితే వారికి ఎంపీలుగా, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అంటే 75ఏళ్లు పైబడిన వారు ఎంపీలు, ఎమ్మెల్యేలు కావచ్చు గానీ పదవులను మాత్రం ఆశించకూడదు. మొత్తానికి మోదీ-షాలు సీనియర్ల విషయంలో తమపై వస్తున్న విమర్శలకు ఈ నిర్ణయం ద్వారా చెక్ పెట్టాలని చూస్తున్నారు. మరి ఈ విషయంలో పార్టీ నుంచి, సీనియర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి! అంటే వచ్చే ఎన్నికల్లో సీనియర్లయిన పలువురికి వారు కోరుకున్న సీట్లు వచ్చే అవకాశం ఉందనే చెప్పాలి.