Advertisementt

‘మనసా వాచా’ మంచి డెసిషన్..!

Tue 12th Mar 2019 01:07 PM
manasa vaacha,release date,march 15th,tejas  ‘మనసా వాచా’ మంచి డెసిషన్..!
Manasa Vaacha Movie Release Date Fix ‘మనసా వాచా’ మంచి డెసిషన్..!
Advertisement
Ads by CJ

గణేష్ క్రియేషన్స్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి ఎం.వి. ప్రసాద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తేజస్-కరిష్మా కర్పాల్-సీమా పర్మార్ హీరోహీరోయిన్స్ గా నిశ్చల్ దేవా-లండన్ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం ‘మనసా.. వాచా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఎం.జి.ఎం’ (మినిమమ్ గ్యారంటీ మూవీస్) ద్వారా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

హీరో టర్నడ్ ప్రొడ్యూసర్ నిశ్చల్ దేవా మాట్లాడుతూ.. ‘లైఫ్ స్టైల్, తులసిదళం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన నేను.. కథ నచ్చడంతో ఈ సినిమాతో నిర్మాతగా మారాను. దర్శకుడు ఎం.వి.ప్రసాద్ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. సినిమా మొత్తం లండన్ లో తీశాం.. అన్నారు. 

దర్శకుడు ఎం.వి.ప్రసాద్ మాట్లాడుతూ.. జ్వరం, జలుబు వంటి వ్యాధులు వచ్చినప్పుడు ఎలా అయితే మందులు వేసుకుని.. ఆ వ్యాధులు నయం చేసుకుంటామో.. క్యాన్సర్ సోకినప్పుడు కూడా అంతే సులభంగా నయం చేసుకునేలా ఉండాలనే లక్ష్యంతో పని చేసే ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనల సమాహారంగా ‘మనసా.. వాచా’ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రం ద్వారా వచ్చే లాభాల్లో సగం క్యాన్సర్ వ్యాధికి ఉచితంగా వైద్యం అందించే సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాం.. అన్నారు. 

ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ‘ఎం.జి.ఎం’ అధినేత అచ్చిబాబు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి సినిమా మా ఎం.జి.ఎం ద్వారా విడుదలవుతుండడం సంతోషంగా ఉంది. మార్చి 15న వీలైనన్ని ధియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. అన్నారు.

Manasa Vaacha Movie Release Date Fix:

Manasa Vaacha Movie Release on March 15th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ