Advertisementt

మహేష్ - అనిల్.. ప్యాడింగ్ అదిరింది

Mon 11th Mar 2019 02:01 PM
vijayasanthi,upendra,reentry,mahesh babu movie  మహేష్ - అనిల్.. ప్యాడింగ్ అదిరింది
Vijayasanthi Reentry in Mahesh Babu Movie మహేష్ - అనిల్.. ప్యాడింగ్ అదిరింది
Advertisement
Ads by CJ

సుకుమార్ ప్లేస్ లో అనిల్ రావిపూడి వచ్చి మహేష్ ను తొలిసారిగా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. మహేష్ - అనిల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజుల భాగస్వామ్యంలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఈ సినిమా మహర్షి రిలీజ్ అయిన తరువాత సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇది ఇలా ఉంటే ఇందులో హీరోయిన్స్ గా రష్మిక ఒకరు ఫైనల్ అయ్యారు. ఇంకో  హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ఒకప్పుడు కథానాయికగా తిరుగులేని ఇమేజ్ సంపాదించి, లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఓ కీలక పాత్ర చేయనుందట.

గతంలో హీరోయిన్ గా చేసిన విజయశాంతి ఆ తరువాత కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేసేది. ఆ తరువాత ఆమె సినిమాలకు దాదాపు దశాబ్దంన్నరగా దూరంగా ఉండి... పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయింది. అయితే ఆమెకు పాలిటిక్స్  పరంగా ఫ్యూచర్ లేకపోవడంతో తిరిగి సినిమాలపై దృష్టి సారించనుందట. అందుకే అనిల్ అడగగానే వెంటనే ఓకే చెప్పేసిందట. అలానే ఉపేంద్ర మళ్లీ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయశాంతి, మహేష్ బాలనటుడిగా ఉన్నప్పుడు ‘కొడుకు దిద్దిన కాపురం’లో కృష్ణ సరసన నటించింది.

Vijayasanthi Reentry in Mahesh Babu Movie:

Vijayasanthi and Upendra in Mahesh - Anil Ravipudi Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ