Advertisementt

మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా

Sun 10th Mar 2019 08:14 PM
ram charan,mega fans,good news,ram charan birthday  మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా
Double Bonanza to Mega Fans on Charan Birthday మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈనెల 27 న అందరికి తెలిసిందే. అందుకే ఇప్పటినుండే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రామ్ చరణ్ బర్త్ డే పోస్టర్స్ తో హంగామా చేస్తున్నారు. ఈ ఏడాది  వినయ విధేయ రామతో ఫ్యాన్స్ కి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ అవి ఏమి పట్టించుకోకుండా ఫుల్ ఖుషిలో ఉన్నారు ఫ్యాన్స్.

అయితే చరణ్ బర్త్ డే సందర్భంగా సైరా చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరాకు రిలీజ్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నారు కానీ ఇంతవరకు కన్‌ఫర్మ్ చేయలేదు. సో చరణ్ పుట్టినరోజున ఇదొక అప్ డేట్ వస్తుందని భావిస్తున్నారు. సైరా రిలీజ్ డేట్ బట్టి మిగిలిన పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవ్వనున్నాయి.

రెండో చిత్రంతోనే 200 కోట్లు పైన బడ్జెట్ తో చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడని చరణ్‌ చూపించిన ప్రొఫెషనలిజమ్‌ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. ఇక అదే రోజు RRR నుండి చరణ్ లుక్ రిలీజ్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు.

Double Bonanza to Mega Fans on Charan Birthday:

Good News to Mega Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ