Advertisementt

బెల్లంకొండకు ఈసారి చిన్న హీరోయిన్లే!

Mon 11th Mar 2019 08:32 AM
nidhi agarwal,bellamkonda srinivas,next film,heroine  బెల్లంకొండకు ఈసారి చిన్న హీరోయిన్లే!
One More Small Heroine for Bellamkonda Srinivas Film బెల్లంకొండకు ఈసారి చిన్న హీరోయిన్లే!
Advertisement
Ads by CJ

ఎప్పుడూ స్టార్ హీరోయిన్స్ ని నమ్ముకుని సినిమా చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి రూటు మార్చాడు. ఇప్పటివరకు ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ తోనే జోడి కట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి ఒకటిరెండు సినిమాలు చేసిన హీరోయిన్స్ ని లైన్ లో పెట్టేస్తున్నాడు. సీత సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఆడిపాడిన పాయల్ రాజపుత్ ని తన తదుపరి చిత్రమైన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలోకి హీరోయిన్‌గా తీసుకున్నాడు. కవచం సినిమా ప్లాప్‌తో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ తో కలిసి సీత సినిమా చేసాడు. సీత సినిమా ఏప్రిల్ 25 న విడుదల కాబోతుంది. 

టైగర్ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా వంశీకృష్ణ డైరెక్షన్‌లో మరో సినిమా మొదలెట్టబోతున్న బెల్లంకొండ ఈసారి RX 100 బ్యూటీ పాయల్ రాజపుట్ తో ఆడిపాడనున్నాడు. RX 100 లో నెగెటివ్ షేడ్స్ తో ఇరగదీసిన పాయల్.. బెల్లంకొండ సరసన పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇక తాజాగా మరో భామని కూడా బెల్లంకొండ.. టైగర్ నాగేశ్వర్ రావు కోసం తీసుకోబోతున్నాడట. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల ప్లాప్స్ తో ఉన్నప్పటికీ.. వరస అవకాశాలు అందుకుంటున్న నిధి అగర్వాల్ ని కూడా బెల్లంకొండ సినిమా కోసం దర్శకనిర్మాతలు సెకండ్ హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టుగా సమాచారం. 

సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల తర్వాత రామ్ సరసన పూరి డైరెక్షన్‌లో ఇస్మార్ట్ శంకర్ లో నటిస్తుంది నిధి. ఇప్పుడు తాజాగా బెల్లంకొండ సరసన కూడా నిధి అగర్వాల్ నటించబోతుంది. ఎంతగా ప్లాప్స్ ఉన్నప్పటికీ.. నిధి లక్కు మాములుగా లేదు. ఎందుకంటే ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించకుండా భారీగా సినిమాలు చేసే హీరో పక్కన మూడు సినిమాలకే నిధి ఛాన్స్ దక్కించుకుంది. ఏది ఏమైనా ఈసారి బెల్లంకొండ మాత్రం చిన్న హీరోయిన్స్ తోనే సరిపెట్టేస్తున్నాడన్నమాట. 

One More Small Heroine for Bellamkonda Srinivas Film:

Nidhi Agarwal selected for Bellamkonda Srinivas next Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ