మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబోలో దిల్ రాజు - అశ్వినీదత్ - పీవీపీ అనే మూడు దిగ్గజాలు నిర్మిస్తున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ మహర్షి సినిమా ఇంకా షూటింగ్ చిత్రీకరణలోనే ఉంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి టీం.. ప్రమోషన్స్ మీద దృష్టి సారించింది. అయితే మహర్షి సినిమాని ఏప్రిల్ మొదట్లోనే విడుదల చేద్దామని ముందుగా మేకర్స్ ప్లాన్ చేసినా.. తర్వాత అది కాస్తా ఏప్రిల్ చివరికి పోస్ట్ పోన్ అయ్యి... తర్వాత మే తొమ్మిదికి వెళ్ళింది. అయితే సినిమా మాటిమాటికి పోస్ట్ పోన్ అయితే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గకుండా మహర్షి మూవీ వర్కింగ్ స్టిల్స్... అంటూ హడావిడి చేస్తూ సినిమాపై టీమ్ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
ఇక తాజాగా మహేష్ మహర్షి విషయంలో ఇప్పుడొక న్యూస్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. అదేమిటంటే మహర్షి సినిమా నిడివి దాదాపుగా నాలుగు గంటలు వచ్చిందట. మరి ఈమధ్యన సినిమాని మూడు గంటలు థియేటర్స్ లో కూర్చుని చూసే ప్రేక్షకులంతా ఎంతగా బోర్ ఫీల్ అవుతున్నారో చూస్తూనే ఉన్నాం. అయితే అటు ఇటుగా ఎడిటింగ్ లో రెండున్నర గంటల నిడివి అయితే వస్తుంది కానీ.. మూడు గంటల కు దగ్గరగా మహర్షి రన్ టైం తేవడం ఇప్పుడు మహర్షి టీం కి సవాల్ గా మారిందట. ఏది ఎడిటింగ్ లో తీసేయాలన్నా... కాస్త ఇబ్బందిగా ఉందనే టాక్ వినబడుతుంది. మరి ఎడిటింగ్ టీం షార్ప్ గా పనిచేసి మహర్షి రన్ టైం ని ఓ కొలిక్కి తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారట. మరి ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా వున్న వంశీ పైడిపల్లి మహర్షి రన్ టైం మీద దృష్టి పెట్టి.. దాన్ని ఒక కొలిక్కి తెచ్చే బాధ్యత తీసుకోబోతున్నాడట.