రామ్‌గోపాల్‌వర్మ మూడ్ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో ఎవరికి అర్థం కాదు. అప్పుడే సీరియస్ సినిమా అంటాడు. ఆ వెంటనే `జీఎస్టీ` (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) పేరుతో బూటు పురాణం మొదలుపెడతాడు. దాని రచ్చ అయిపోయిందా అనుకునే లోపే మళ్లీ మరో వివాదస్పద సినిమాకు శ్రీకారం చుడతాడు. ప్రస్తుతం `లక్ష్మీస్ ఎన్టీఆర్` పేరుతో ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో రచ్చ చేస్తున్న వర్మ ఈ సినిమాతో ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసేశాడు. తనని హత్య చేస్తే తప్ప `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదలను ఎవరూఆపలేరని స్టేట్‌మెంట్ ఇచ్చిన వర్మ కు మళ్లీ కొత్త ఆలోచన వచ్చిందట.
ఆ మధ్య 2014లో తేజస్విని కథానాయికగా ప్రమోట్ చేస్తూ `ఐస్ క్రీమ్` చిత్రాన్ని రూపొందించి తనలో వున్న దర్శకుడు పతనరావస్థకు చేరుకున్నాడని తెలియజెప్పన వర్మ. ఆ తరువాత దీనికి సీక్వెల్ అంటూ చేసిన `ఐస్ క్రీమ్-2`తో మరింత చండాలమైన చిత్రాన్ని తీసిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. విమర్శకుల చేతిలో చీవాట్లు తిన్న వర్మ మళ్లీ తన ఇంటలిజెన్సీకి తగ్గ సినిమాల వైపు టర్న్ తీసుకున్నాడు. అయితే వర్మకు మళ్లీ ఐస్ క్రీమ్ మీదికి గాలి మళ్లీందట. ఐస్‌క్రీమ్ 3 పేరుతో మరో కళాఖండాన్ని జనాల మీదకి వదలాలని ప్లాన్ చేస్తున్నాడట.
అయితే ఈ థర్డ్ ఇన్స్టాల్‌మెంట్‌కి వర్మ దర్శకుడిగా వ్యహరిచడం లేదన్న తాజా టాక్. గత ఐదేళ్లుగా వర్మ కంపెనీలోని దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న అక్షయ్‌ని ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడట వర్మ. కథ, కథనం, దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే తాను చూసుకుని దర్శకత్వ బాధ్యతల్ని అక్షయ్‌కి అప్పగిస్తున్నాడట. దీనికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా వ్యవహిరించే అవకాశం వుందని ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది.