రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న RRR సినిమా ప్రస్తుతం కలకత్తా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోవడానికి సమాయత్తం అవుతుంది. 1947 బ్రిటిష్ నేపథ్యంలో తెరకెక్కుతున్న RRR సినిమా ఇప్పటివరకు రెండు షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇంకా హీరోయిన్స్ విషయంలో రాజమౌళి ఓ కొలిక్కి రాలేదు కానీ.. సినిమా షూటింగ్ మాత్రం చాలా ఫాస్ట్ గానే చిత్రీకరిస్తున్నారు. ఇకపోతే RRR లో రామ్ చరణ్ రోల్ బ్రిటిష్ కాలంనాటి పోలీస్ ఆఫీసర్ పాత్ర అని.. ఎన్టీఆర్ మాత్రం నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపిస్తాడని ప్రచారం ఉంది.
ఇక RRR సెకండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై సోలో షూటింగ్ చేసిన రాజమౌళి ఆ కాలంనాటి పోలీస్ స్టేషన్ సీన్స్ నే చిత్రీకరించాడు. ఇక ఇప్పుడు RRR పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడట. మరింతకుముందే రామ్‌చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని న్యూస్ పై ఆల్ రెడీ ఒక క్లారిటీ వచ్చింది. తాజాగా ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ కలిగిన ఫారెస్ట్ ఆఫీసర్ రోల్ అంటే... మరి ఈ రోల్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడడం ఖాయమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు కూడా.
RRR లో ఎన్టీఆర్ పాత్ర రావణాసురుడుని పోలివుంటే... జై లవ కుశలో జై పాత్రలో ఎన్టీఆర్ నటనలో రెచ్చిపోయినట్లుగా... ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ఉంటుందేమో అంటూ ఎన్టీఆర్ అభిమానులు సంబరపడిపోతున్నారు. అయితే రాజమౌళి RRR లో రామ్ చరణ్ పాత్రను రామాయణంలోని శ్రీ రాముడు క్యారెక్టర్ ఆధారంగా డిజైన్ చేస్తే.. ఎన్టీఆర్ పాత్రను రావణుడి ఆధారంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ కండలు పెంచి రావణాసురుడుగా బలంగా కనిపిస్తాడంటున్నారు. ఇక రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా ఇప్పుడున్న ఫిట్ నెస్ సరిపోతుందని అందుకే స్పెషల్ మేకోవర్ రామ్ చరణ్ కి లేదట. ఇకపోతే రామ్ చరణ్ కి హీరోయిన్ గా అలియా భట్ ఫైనల్ అనే టాక్ నడుస్తుంటే. ... ఎన్టీఆర్ హీరోయిన్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.