తాజాగా సహజనటి జయసుధ వైసీపీ కండువా కప్పుకుంది. లోటస్‌పాండ్‌లో తన కుమారుడితో కలిసి ఆమె జగన్‌ని కలిసి పార్టీ తీర్ధం తీసుకుంది. భర్త మరణం తర్వాత కాస్త డల్ అయిన ఆమె మరలా రాజకీయాలలో బిజీగా మారనుంది. ఆమె క్రైస్తవ మత ప్రభోధకురాలు అన్న విషయం తెలిసిందే. మరో క్రైస్తవ మత బోధకురాలైన దివ్యవాణి టిడిపిలో చేరడం, దానికి కొద్ది వ్యవధిలోనే జయసుధ వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం గమనార్హం.
ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, మరలా నా సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది. నన్ను రాజకీయంగా ఎదిగేలా చేసిన వ్యక్తి వైయస్ రాజశేఖర్‌రెడ్డి. ఎంతో మంది సీనియర్లు ఉన్నా వైఎస్ వారిని కాదని నన్ను పిలిచి టిక్కెట్ ఇచ్చి నా గెలుపుకు కృషి చేశారు. ఇప్పుడు వైసీపీలోకి రావడం ఆనందంగా ఉంది. పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తాను. లేదంటే పార్టీకి ప్రచారం చేస్తానని తెలిపింది. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్ట్‌లు జగన్‌తో నాగార్జున భేటీ గురించి ప్రశ్న అడగగా, ఆమె దానికి సమాధానం ఇస్తూ, సినిమా వారు జగన్ వంటి వ్యక్తులను కలవడం దురదృష్టకరమని బాబు అన్నారు.
నాగార్జున సినీ నటునిగా వచ్చి జగన్‌ని కలవలేదు. వైఎస్ కుటుంబానికి దగ్గర వ్యక్తిగా ఆయన జగన్‌ని కలిశారు. అయినా సినిమా వారు రాజకీయ నాయకులను ఎందుకు కలవకూడదు? చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో సగం మంది సినిమాలలోనే ఉన్నారు. సినిమా వారు అని తక్కువ చేసి చులకనగా మాట్లాడటం తగదు. వారు కూడా దేశంలో ఓటర్లే. టీడీపీ యాడ్స్ చేయడానికి, పుష్కరాల నిర్వహణకు, పార్టీ ప్రచారాలకు మాత్రం సినిమా వారు పనికి వస్తారు. కానీ రాజకీయ నాయకులను కలిసేందుకు మాత్రం పనికి రారా? అంటూ ఆమె చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు సమంజసంగానే కాదు.. బాబుకి ఈ విషయంలో గట్టి కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి.
మరి గతంలో జయసుధ క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే సికింద్రాబాద్‌లో కలిసింది. మరి జగన్ ఏపీ ఎన్నికల్లో ఆమెకి టిక్కెట్ ఇవ్వాలి అంటే ఆ స్థానం కేటాయిస్తారో వేచిచూడాలి.....!