ఏ దేశానికైనా విదేశాంగ విధానం అనేది ముఖ్యమైనది. పక్కదేశాలను మంచి చేసుకోవడంలో, విరోధులను చేసుకోవడంలో విదేశాంగ విధానమే కీలక భూమిక పోషిస్తోంది. ఇక మన దేశం, మాతృభూమి భారతదేశం కాబట్టి మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పు.. అది దేశద్రోహం అని, అలా ప్రశ్నించేవారిని దేశద్రోహులనడం సరికాదు.
ఇక విషయానికి వస్తే భారతదేశానికి చుట్టుపక్కల దేశాలలో, చిన్న చిన్న దేశాలతో కూడా భారత్‌కి మంచి సంబంధాలు లేవు. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్. ఈ రెండింటితోనూ భారత్‌కి వైరమే. ఇక శ్రీలంక, మరో హిందు దేశం అయిన నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, ఆఫ్గనిస్థాన్, చివరకు మాల్దీవులతో కూడా భారత్‌కి సరైన మితృత్వం లేదు. తోటి హిందు దేశం అయిన నేపాల్ కూడా ఈమధ్య చైనాకి దగ్గరవుతోంది. ఇక నాడు పాకిస్థాన్‌లో భాగంగా ఉన్న బంగ్లాదేశ్‌ని స్వతంత్య్రదేశం చేసిన చరిత్ర భారత్‌కి ఉంది.
కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మనకి శత్రువే. నిజానికి మన దేశం నియమాల ప్రకారం పరాయిదేశం వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకూడదనేది నిజమైన సత్యం. కానీ మనం శ్రీలంకలో ఎల్‌టిటిఈకి శ్రీలంక సైన్యానికి అంతర్యుద్దం జరుగుతున్న సమయంలో మౌనంగా ఉండాల్సిన మనం శ్రీలంక సైన్యాన్ని సపోర్ట్ చేశాం. ఎల్‌టిటిఈకి చెందిన భారత తమిళులపై యుద్దం చేశాం. ఎల్‌టిటిఈ నాయకుడు ప్రభాకరన్‌ని మోసపూరితంగా శ్రీలంకకి అప్పగించాలని ప్రయత్నించాం. ఇదే చివరకు రాజీవ్‌గాంధీ ప్రాణాలను బలిగొంది.
ఇక సిక్కుల విషయంలో, వారి మత విశ్వాసాలతో, స్వర్ణదేవాలయంలోకి ప్రవేశించి భారత్ సైన్యం మరో పెద్ద తప్పు చేసింది. దాని పర్యావసానమే ఇందిరాగాంధీ హత్య. ఇలా భారత్‌కి సరైన విదేశాంగ విధానం లేకపోవడం వల్లనే మన దేశానికి చుట్టు పక్కల ఉండే దేశాలు, ఆయా దేశాల ప్రజల మనసులను మనం గెలవలేకపోతున్నాం. ఇక బిజెపి(ఎన్డీయే) హయాంలోనైనా మార్పు వస్తుంది అనుకుంటే అది కూడా ఎడారిలో ఎండమావిలా తయారైంది. ఇప్పటికైనా భారత విదేశాంగ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందనే చెప్పాలి.