`బాహుబలి`తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ తన తదుపరి సినిమా బిజిఎస్‌ని కూడా ఆ రేంజ్‌లోనే మోత మోగించేస్తున్నాడు. `బాహుబలి` తనువాత ప్రభాస్ సినిమా అంటూ భారతీయ సినీ ప్రేమికులు అటెన్షన్‌తో ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఏ మాత్రం హాలీవుడ్ చిత్రాలకు తీసిపోని విధంగా `సాహో` చిత్రాన్ని భారీ స్థాయిలో యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో ముస్తాబవుతున్న ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోస్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1, చాప్టర్ 2 పేరుతో విడుదలైన ఈ చిత్ర మేకింగ్ వీడియోలు సర్వత్రా ఆసక్తిని పెంచేశాయి.
అందుకు తగ్గట్టుగానే సినిమాను తెరపైకి తీసుకొస్తున్నారు. భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచ సినిమా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా బిజినెస్ కూడా ఊపందుకుంది. ఇంకా చిత్రీకరణ దశలో వున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం వివిధ ఏరియాల నుంచి భారీ స్థాయిలో ఎంక్వైరీస్ అప్పుడే మొదలయ్యాయి. హిందీ థియేట్రికల్ రైట్స్‌ని ఇప్పటికే టీ సిరీస్ సంస్థ 125 కోట్లుకు సొంతం చేసుకుంది.
ఇక ఓవర్సీస్ రైట్స్‌ని దుబాయ్‌కి చెందిన ఫార్స్ ఫిల్మ్ కంపెనీ 36 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్‌లోనే తన సినిమాకు ఓవర్సీస్ రైట్స్ రూపంలో లభించిన హయ్యెస్ట్ అమౌంట్ ఇది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ కలిపి ఈ మొత్తానికి అమ్మేశారు. 300 కోట్లతో రూపొందుతున్న ఈ సినిమా మిగతా ఏరియాల్లో బిజినెస్ జరగాల్సి వుంది. అయితే `బాహుబలి` వల్ల ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చే అవకాశం వుందని చెబుతున్నారు. నిర్మాణ దశలో వున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.