Advertisementt

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: వర్మని వేడుకుంటున్నారట!

Thu 07th Mar 2019 11:14 PM
ram gopal varma,lakshmis ntr buyers,request  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: వర్మని వేడుకుంటున్నారట!
Lakshmis NTR Movie Latest Update ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: వర్మని వేడుకుంటున్నారట!
Advertisement
Ads by CJ

సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తీసుకున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ లైఫ్ లోకి లక్ష్మి పార్వతి ఎంట్రీ ఇచ్చిన తరువాత నందమూరి ఫ్యామిలీస్ మధ్య వచ్చిన గ్యాప్, ఎన్టీఆర్ రాజకీయాల్లో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా వర్మ ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. అంతా బాగానే ఉంది ఈసినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది టెన్షన్ గా మారింది.

ఎన్టీఆర్ బయోపిక్ నుండి వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు రెండు డిజాస్టర్స్ అవ్వడంతో ఈసినిమాను కొన్ని ఏరియాస్ లో కొనడానికి కొంతమంది బయ్యర్లు మొగ్గుచూపటం లేదని అంతర్గత సమాచారం. ట్రైలర్ బాగున్నప్పటికీ స్టోరీ మొత్తం రివీల్ చేసేశారని వారి వాదన. అయితే మరో వైపు కొనుగోలు చేసిన కొన్ని ఏరియాల బయ్యర్లు.. రిలీజ్ డేట్ మార్చమని వర్మని రిక్వెస్ట్ చేసినట్టు టాక్.

ఈ చిత్రం రిలీజ్ కి ఒక రోజు ముందు అల్లు శిరీష్- ఎబిసిడి, సువర్ణ సుందరి, ప్రేమ కథాచిత్రం 2 లాంటి మీడియం రేంజ్ చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలానే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి వారం ముందుగా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమా రానుంది. సో ఇన్ని సినిమాల మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా రిలీజ్ అయితే థియేటర్స్ సమస్య ఎదురయ్యే అవకాశం వుందని భావించిన బయ్యర్లు రిలీజ్ డేట్ ను మార్చవలసిందిగా కోరారట. అయితే వర్మ మాత్రం ఈసినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు టాక్.

Lakshmis NTR Movie Latest Update:

Buyers request to Varma for Lakshmis NTR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ