Advertisementt

ఫ్లాపుల లిస్ట్ కూడా చూసుకోవాలిగా దిల్ రాజు

Thu 07th Mar 2019 07:47 PM
dil raju,maharshi,mahesh babu,maharshi on may 9th,may release  ఫ్లాపుల లిస్ట్ కూడా చూసుకోవాలిగా దిల్ రాజు
Doesnt Dil Raju remember these flops ఫ్లాపుల లిస్ట్ కూడా చూసుకోవాలిగా దిల్ రాజు
Advertisement
Ads by CJ

మహేష్ బాబు మహర్షి సమ్మర్ రేస్ నుంచి అవుట్ అవుట్ అని వెబ్ సైట్స్, సోషల్ మీడియా పేజస్ కోడై కూస్తున్న తరుణంలో మొన్న ఉన్నట్లుంది ఏప్రిల్ 25 మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేయించిన దిల్ రాజు నిన్న ఉన్నట్లుండి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ మహర్షి సినిమాని మే 9కి పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చెబుతూ.. మే నెలలోనే అశ్వినీదత్ కు జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి లాంటి హిట్స్ వచ్చాయి, మా బ్యానర్ లో కూడా మే వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. అందుకే మే 9కి మహర్షి రిలీజ్ డేట్ ఫైనల్ చేశాం అని చెప్పుకొచ్చాడు. అక్కడివరకూ బాగానే ఉంది కానీ.. దిల్ రాజు ఫ్లాప్స్ ఎందుకు చూసుకోలేదు అని డౌట్ మొదలైంది జనాలకి. 

మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ గా నిలిచిన నాని, బ్రహ్మోత్సవం చిత్రాలు మేలోనే విడుదలయ్యాయి. నిజానికి బ్రహ్మోత్సవం చిత్రాన్ని ఏప్రిల్ లోనే విడుదల చేద్దామనుకున్నారు కానీ.. మేకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇలా మహర్షి సినిమాని ఏప్రిల్ రిలీజ్ అనుకుని మేలో విడుదల చేయడం అనేది మహేష్ బాబు ఫ్యాన్స్ దిగమింగుకోలేకపోతున్నారు. పొరపాటున ఈ సినిమా కూడా ఆ మే సెంటిమెంట్ పుణ్యమా అని ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటీ అనే విషయం ఎవరికీ అర్ధం కావడం లేదు. మహేష్ బాబు కూడా ఈ విషయమై ఆలోచిస్తున్నాడని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉంది కాబట్టి త్వరలోనే విడుదల తేదీలో మరో మార్పు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Doesnt Dil Raju remember these flops :

Mahesh babu fans are angry with the new release Date of Maharshi 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ