Advertisementt

ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ కి ఈ టైటిల్ ఏదో తేడాగా ఉంది..

Thu 07th Mar 2019 05:06 PM
dil raju,96 remake,janaki devi,sharvanand,samantha  ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ కి ఈ టైటిల్ ఏదో తేడాగా ఉంది..
Will Audience accept this title for 96 remake ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ కి ఈ టైటిల్ ఏదో తేడాగా ఉంది..
Advertisement
Ads by CJ

ఈమధ్యకాలంలో టాలీవుడ్ లో భీభత్సంగా డిస్కస్ చేసిన రీమేక్ సినిమా 96. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాక నిర్మాతకు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టింది. తమిళనాట ఈ చిత్రాన్ని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అని ఫిక్స్ అయిపోయారు జనాలు. తొలుత ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం కంటే డబ్ చేయడం బెటారేమోనని నిర్మాతలు సైతం భావించారు కానీ.. తెలుగులో ఎమోషన్స్ ను ఇంకాస్త బాగా చూపించవచ్చని ఒరిజినల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ భావించడంతో దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్, సమంత జంటగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కోసం చర్చలు మొదలై.. త్వరలోనే షెడ్యూల్ కూడా మొదలుకానుంది. 

అయితే.. ఈ రీమేక్ కు దిల్ రాజు ఫిలిమ్ ఛాంబర్ లో జానకీ దేవి అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. జానకీ అనేది సినిమాలో హీరోయిన్ పాత్ర. అయితే.. ఇలా ప్రేమకథకి హీరోయిన్ క్యారెక్టర్ పేరును టైటిల్ గా పెట్టడం వల్ల హీరోయిన్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీ అనుకొనే ప్రమాదం ఉంది. అలాగే.. ఆల్రెడీ శర్వానంద్ హీరో అయినప్పటికీ అందరు సమంత గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో టైటిల్ కూడా ఆమె క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా పెట్టడం వలన మనోడి ఇమేజ్ కి డ్యామేజ్ కాకపోయినా ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం సమంత ఖాతాలోకే వెళ్ళిపోయి.. శర్వా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా మిగిలిపోవాల్సి వస్తుంది.

Will Audience accept this title for 96 remake:

Dil Raju Registered Janaki Devi Title for the Remake of 96

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ