Advertisementt

హీరోయిన్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!

Thu 07th Mar 2019 04:53 PM
sonali bindre,cancer,scar  హీరోయిన్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!
Must Appreciate this Actress Daring హీరోయిన్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!
Advertisement
Ads by CJ

ముఖం మీద చిన్న మొటిమ వస్తేనే అది పోయేవరకూ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టడం మానేస్తున్నారు అమ్మాయిలు. అలాంటిది ఇంద్ర, మన్మధుడు, మురారి చిత్రాల ఫేమ్ సోనాలీ బింద్రే మాత్రం తన క్యాన్సర్ సర్జరీ మార్క్ తో ఒక ఫోటో దిగి ధైర్యంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇదివరకూ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి కూడా ఇదే తరహాలో తన క్యాన్సర్ సర్జరీ తాలూకు మచ్చతో బ్యాక్ లెస్ ఫోటో అప్లోడ్ చేసి ప్రశంసలు అందుకున్న విషయం నుంచి స్పూర్తి పొంది.. సోనమ్ కూడా తన ఫోటోను అప్లోడ్ చేసింది. గుండుతో ఉన్న సోనమ్ కపూర్ మెటల్ డ్రెస్ లో దిగిన ఆ ఫోటోలో ఆమె హృదయం కింద భాగంలో చేసిన 20 అంగుళాల సర్జరీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్క్ కనిపించేలా సోనాలీ ఫోటో పెట్టడం అనేది ఆమె ధైర్యానికి నిదర్శనం. 

ఆమె మళ్ళీ సినిమాల్లోకి వస్తుందా లేక టీవీ షోలకు పరిమితం అవుతుందా అనే విషయం పక్కన పెడితే.. ఆమె యాటిట్యూడ్ మరియు ధైర్యం మాత్రం చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇదివరకూ మనీషా కోయిరాలా కూడా ఇలాగే క్యాన్సర్ ను జయించినప్పటికీ ఇలా సోనాలీ తరహాలో ధైర్యంగా తన స్కార్ ను చూపించలేకపోయింది. 

Must Appreciate this Actress Daring :

Sonali Bindre Uploaded a photo with her cancer treatment scar and people are appreciating for that

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ