గత రెండు రోజులుగా మహేష్ - సుకుమార్ సినిమాపై మీడియాకి కావాల్సినంత మేత దొరికింది. మహేష్ - సుకుమార్ కాంబోపై గత ఆరు నెలలుగా ఏదో ఒక వార్త మీడియాలో నానుతూనే ఉంది. మహేష్ సుకుమార్ కథకి కనెక్ట్ అవడం లేదు.. సుకుమార్ మహేష్ ని ఇంప్రెస్స్ చేయలేకపోతున్నాడు, రంగస్థలం రేంజ్ కథని మహేష్ ఎక్సపెక్ట్ చేస్తున్నాడు, లైన్ ఇస్తే సరిపోదు.. ఫుల్ స్టోరీని రెడీ చెయ్యమని మహేష్, సుకుమార్ కి అల్టిమేటం ఇచ్చాడట.. ఇలా చాలానే న్యూస్ లు మీడియాలో వినబడినాయి. మరి మీడియాలో గాసిప్ కింద వినబడినవన్నీ నిజమే. మహేష్, సుకుమార్ మూవీకి మంగళం పాడేశాడు మహేష్. ఇక సుకుమార్ సీక్రెట్ గా అల్లు అర్జున్ కి కథ చెప్పి ఒప్పించి సినిమాని కమిట్ చేయించి మరీ.. అధికారిక ప్రకటన ఇప్పించేసాడు.
మరి మరోపక్క అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబో పై కూడా ఇలాంటి కథనాలే మీడియాలో వినబడుతున్నాయి. ఏడాది కాలంగా హిట్ కథ కోసం కాచుకుని కూర్చున్న బన్నీ, త్రివిక్రమ్ చెప్పే కథలను లైట్ తీసుకుంటున్నాడని, త్రివిక్రమ్ మాట మీద అన్ని జరుగుతున్నాయని, బన్నీ మాట త్రివిక్రమ్ వినడం లేదని, మరోపక్క కథ బాగా రావడానికి త్రివిక్రమ్ చాలా కష్టపడుతున్నాడని, ఇక ఫుల్ స్క్రిప్ట్ తోనే సెట్స్ మీదకెళదామని బన్నీ పట్టుబడుతున్నాడని, కాకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రమే పూర్తి చేసాడు కాబట్టే.. అల్లు అర్జున్ డేరింగ్ గా సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లలేకపోతున్నాడని, మరోపక్క ఫస్ట్ హాఫ్ సూపర్‌గా రావడంతో సెకండ్ హాఫ్ కోసం త్రివిక్రమ్ మరికొంత టైం తీసుకుంటున్నాడని ఇలా చాలానే వార్తలు తెర మీదకొచ్చాయి.
ఇక త్రివిక్రమ్ టైంకి కథ సిద్ధం చెయ్యకపోతే... అనుకోకుండా సుకుమార్ తో కనెక్ట్ అయిన అల్లు అర్జున్, త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చేసి సుకుమార్ తో సెట్స్ మీదకెళ్ళిపోవచ్చనే ప్రచారం స్టార్ట్ అయ్యింది. మరి మహేష్ కి.. సుకుమార్ హ్యాండ్ ఇచ్చి అల్లు అర్జున్ కి కమిట్ అయితే.. ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కి హ్యాండిచ్చి సుకుమార్ తో సినిమా మొదలెట్టినా మొదలెట్టొచ్చు అంటూ ఊహాగానాలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.