Advertisementt

కె విశ్వనాథ్ ఆశీస్సులతో ‘సర్వం తాళ మయం’

Thu 07th Mar 2019 08:50 AM
sarvam thaala mayam,release,date fix,march 8  కె విశ్వనాథ్ ఆశీస్సులతో ‘సర్వం తాళ మయం’
Sarvam Thaala Mayam Release Date Fixed కె విశ్వనాథ్ ఆశీస్సులతో ‘సర్వం తాళ మయం’
Advertisement
Ads by CJ

కళాతపస్వి కె విశ్వనాథ్ ప్రశంసలు అందుకున్న రాజీవ్ మీనన్ ‘సర్వం తాళ మయం’ మార్చి 8 విడుదల

శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ రాజీవ్ మీనన్ రూపొందించిన ‘సర్వం తాళ మయం’ చిత్రాన్ని చూసి, ‘‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్ కి నా ఆశీర్వాదాలు.’’ అని అభినందించి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. 

అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి రాజీవ్ మీనన్ ని ఎంతగానో ప్రశంసించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. మార్చి 8 న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం అన్ని మల్టిప్లెక్స్ ధియేటర్లలోనూ విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాత రాజీవ్ మీనన్ చెప్పారు.

జి వి ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రంలో నేడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి..

సంగీతం : ఏ ఆర్ రహమాన్, సినిమాటోగ్రఫీ : రవి యాదవ్, ఆర్ట్ : సి ఎస్ ఆనందన్, లిరిక్స్ : రాకెందు మౌళి, డైలాగ్స్ : ఘంటసాల రత్న కుమార్, ఏక్షన్ : దినేష్ సుబ్బరాయ యన్,  ఎడిటింగ్ : అంతోని

నిర్మాత : లత, కథ, కథనం, దర్శకత్వం : రాజీవ్ మీనన్.

Sarvam Thaala Mayam Release Date Fixed:

Sarvam Thaala Mayam Release on March 8th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ