Advertisementt

‘ఉద్ఘర్ష’ ట్రైలర్ వదిలారు

Wed 06th Mar 2019 10:01 PM
udgharsha movie,trailer,launch,event,details  ‘ఉద్ఘర్ష’ ట్రైలర్ వదిలారు
UDGHARSHA Movie Trailer Released ‘ఉద్ఘర్ష’ ట్రైలర్ వదిలారు
Advertisement
Ads by CJ

కన్నడ సినీ పరిశ్రమలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఆద్యుడు డైరెక్టర్ సునీల్‌ కుమార్‌ దేశాయ్‌.. అయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉద్ఘర్ష’.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్  ఇటీవలే పూర్తి చేసుకోగా, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా  విడుదల అవుతుండడం విశేషం.. ఈ సినిమాలోని అధికభాగం చిత్రీకరణ మడికెరిలో జరగగా కేరళ, బెంగళూరు, హైదరాబాదు నగరాల్లో ప్రధాన సన్నివేశాల్ని చిత్రీకరించారు.. కిషోర్, సాయి ధన్సిక, తాన్య హోప్, కబీర్ దుహాన్ సింగ్, బాహుబలి ఫేమ్ ప్రభాకర్, హర్షికా , అనూప్‌సింగ్‌ ఠాకూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. డి క్రియేషన్స్‌ పతాకంపై దేవ్ రాజ్ ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా  ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. బాలీవుడ్ సంగీత దర్శకుడు సంజయ్ చౌదరి సంగీతం సమకూరుస్తుండగా పి.రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.. కాగా ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుక బెంగుళూరులో ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ హీరో దర్శన్  ఈ చిత్ర  ట్రైలర్ ని విడుదల చేశారు.. ప్రముఖ హీరో కిచ్చ సుదీప్ ఈ ట్రైలర్ కి వాయిస్ అందించగా,  ప్రేక్షకులను విశేషంగా అక్కట్టుకుంటుంది.. 

తారాగణం : అనూప్‌సింగ్‌ ఠాకూర్‌, కిషోర్, సాయి ధన్సిక, తాన్య హోప్, కబీర్ దుహాన్ సింగ్, బాహుబలి ఫేమ్ ప్రభాకర్, హర్షికా

సాంకేతిక విభాగం : 

బ్యానర్ : డి క్రియేషన్స్‌

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : సునీల్‌కుమార్‌ దేశాయ్‌

నిర్మాత :  దేవ్ రాజ్ ఆర్

మ్యూజిక్ డైరెక్టర్ : సంజయ్ చౌదరి

సినిమాటోగ్రఫీ :  పి.రాజన్ , K.M. విష్ణువర్ధన్

ఆర్ట్ డైరెక్టర్: మోహన్ B కేర్

ఎడిటింగ్: బి.ఎస్.కెంపరాజు

స్టంట్స్: వెంకట్ మరియు నబా-సుబ్బు

సౌండ్ ఎఫెక్ట్స్: శంకర్

మాటలు: హనుమాన్ చౌదరి, కే.ప్రతాప్ రెడ్డి

ప్రచార డిజైనర్: భూషణ్

కాస్ట్యూమ్ డిజైనర్: గందసి నాగరాజ్

UDGHARSHA Movie Trailer Released :

UDGHARSHA Movie Trailer Launch Event Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ