మరోసారి మహర్షి వార్తల్లోకి

Mahesh Maharshi Movie Postponed

సూపర్ స్టార్ మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే నెల ఏప్రిల్ 5 న విడుదల కావాల్సివుంది. కానీ షూటింగ్ లేట్ అవుతుందని ఏప్రిల్ 25 కు షిఫ్ట్ చేసారు. అయితే ఇప్పుడు 25 కాదు మే 9 న రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారట.

మరి కొన్ని గంటలో నిర్మాత దిల్ రాజు దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. షూటింగ్ ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 13 వరకు షూటింగ్ పనులు ఉన్నాయి అందుకే మహేష్ ని కన్విన్స్ చేసే పనిని నిర్మాత దిల్ రాజు తన మీద వేసుకున్నారు. 

మే అంటే మహేష్ బాబుకి సెంటిమెంట్ కి ఒప్పుకుంటాడా? అని అడిగితే. అదేమీలేదని, సినిమా చాలా బాగా వచ్చిందని, ష్యూర్ షాట్ హిట్ అని యూనిట్ భావిస్తోంది. సో మహేష్ కూడా కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారంగా ప్రకటన రానుంది.

Maharshi Movie Latest Update

mahesh babu
maharshi movie
postponed