అమెజాన్ ప్రైమ్ కోసం బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ సాహసం చేశారు. ముంబైలో అమెజాన్ ప్రైమ్ ఓ కార్యక్రమాన్ని నిర్వమించింది. ఈ కార్యక్రమం జరుగుతుండగానే అక్షయ్‌కుమార్ నిప్పంటించుకని స్టేజ్ పైకి రావడం అక్కడున్న వారిని షాక్‌కు గురిచేసింది. అసలు విషయం ఏంటంటే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న అక్షయ్ త్వరలో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించడం కోసం ముంబైలో అమెజాన్ ప్రైమ్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రంలో పాల్గొన్న అక్షయ్ వెబ్ సిరీస్ ప్రచారం కోసం ఏకంగా తన ఒంటికి నిప్పంటించుకుని స్టేజ్ పైకి రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అక్షయ్ మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్. ఇలాంటి ఫీట్‌లని తన కెరీర్‌లో ఎన్నో చూశారాయన. ఆ అనుభవంతో నిపుణుల పర్యవేక్షణలో ఈ ఫీట్‌ని తెరలేపినట్టు తెలిసింది. గత కొంత కాలంగా విభిన్నమైన లైనప్‌తో కొత్త తరహా చిత్రాల్లో నటిస్తూ సత్తాచాటుతున్నఅక్షయ్ తన కొడుకు కోరిక మేరకు తొలిసారి వెబ్ సిరీప్‌లో నటిస్తున్నారు. `హీరోగా క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నా నా కొడుకు ఆరవ్ కోరిక మేరకు వెబ్ సిరీస్ చేస్తున్నాను. యువతకు దగ్గర కావాలంటే వెబ్ సిరీస్ చేయాల్సిందే. వాడి కోరికని కాదన లేకే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను` అని అక్షయ్ కుమార్ చెప్పడం విశేషం.