Advertisementt

సీనియ‌ర్ హీరో అయితే ర‌కుల్‌కి ఎక్స్‌ట్రా ..!

Wed 06th Mar 2019 04:24 PM
rakul preeth singh,rakul preeth,nagarjuna,manmadhudu,manmadhudu 2,rahul ravindran,  సీనియ‌ర్ హీరో అయితే ర‌కుల్‌కి ఎక్స్‌ట్రా ..!
rakul preet singh demanding more సీనియ‌ర్ హీరో అయితే ర‌కుల్‌కి ఎక్స్‌ట్రా ..!
Advertisement
Ads by CJ

ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్న‌దే మ్యాట‌ర్‌. సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రితో సినిమా చేశామన్న‌ది ఇప్పుడు ముఖ్యం కాదు రెమ్యున‌రేష‌న్ ఎంతొచ్చింది అన్న‌దే ఇప్పుడు ముఖ్యం అంటోంది ఢిల్లీ బేబీ ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. అదేంటి ర‌కుల్ ప్రీత్‌సింగ్‌కు తెలుగుఓ పెద్ద‌గా అవ‌కాశాలు లేవుక‌దా?  క్రేజ్ లేక‌పోయినా డిమాండ్ చేయ‌డ‌మేంటి? అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టే. స్టార్ హీరో కాక‌పోతే సీనియ‌ర్ హీరో ఇలా ఎవ‌రు పిలిచి అవ‌కాశం ఇచ్చినా ఇప్ప‌టికీ త‌న‌కు ఎంతో కొంత క్రేజ్ వున్న‌ట్టే లెక్క‌. ఆ లెక్క ప్ర‌కార‌మే ర‌కుల్ త‌న‌కు లెక్క దండిగా కావాలంటోంద‌ట‌. 

నానితో చేసిన `దేవ‌దాస్‌` ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఇక సోలోగా దున్నేద్దామ‌ని మ‌ళ్లీ `మ‌న్మ‌థుడు` స్క్రిప్ట్ ని కొత్త వెర్ష‌న్‌లో నాగార్జున త్వ‌ర‌లో తెర‌పైకి తీసుకురాబోతున్న విష‌యం తెలిసిందే. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమా కోసం ముందు అనుష్క‌ని అనుకున్న నాగ్ త‌న డేట్స్ లేక‌పోవ‌డంతో ఆ స్థానంలో ర‌కుల్‌ని ఫిక్స్ చేసుకున్నారు. నాగ్‌కు ర‌కుల్ పెద్ద ట్విస్ట్ ఇచ్చేసింద‌ట. సీనియ‌ర్ హీరో కాబ‌ట్టి మీ ప‌క్క‌న న‌టించాలంటే రెమ్యున‌రేష‌న్ భారీగా కావాల‌ని ష‌ర‌తు విధించింద‌ట‌.  

మామూలుగా ఇప్ప‌టి వ‌ర‌కు కోటి పారితోషికం తీసుకుంటూ వ‌చ్చిన ర‌కుల్ ఈ సినిమా కోసం ఏకంగా కోటిన్న‌ర డిమాండ్ చేసిన‌ట్లు చెబుతున్నారు. అయితే ర‌కుల్ డిమాండ్‌ని అంగీక‌రించిన నాగార్జున త‌ను అడిగినంత ఇవ్వ‌డానికి సిద్ధ‌మౌతున్నాడ‌ని, ఈ సినిమా పేలితే ర‌కుల్ పంట‌పండిన‌ట్లేన‌ని ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. 

rakul preet singh demanding more:

rakul preet singh demanding extra

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ