Advertisementt

‘సాహో’.. ఏంటీ లెక్కలు అంటున్నారు!

Wed 06th Mar 2019 12:09 PM
prabhas,saaho,350 crores,theatrical rights  ‘సాహో’.. ఏంటీ లెక్కలు అంటున్నారు!
Saaho Business Creates Sensation ‘సాహో’.. ఏంటీ లెక్కలు అంటున్నారు!
Advertisement
Ads by CJ

ఒక చిత్రం చారిత్రక విజయం సాధిస్తే సంతోషమే గానీ దాని తర్వాత చిత్రాలపై అంతకు మించిన అంచనాలు ఏర్పడతాయనేది వాస్తవం. వాటిని అందుకోలేక బడా బడా స్టార్స్‌ కూడా బోల్తాపడ్డారు. కానీ బాహుబలి వంటి కనీవినీ ఎరుగని చిత్రం తర్వాత ప్రభాస్‌ ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్‌తో హాలీవుడ్‌ రేంజ్‌ యాక్షన్‌ని నమ్ముకుని వస్తున్నాడని తెలిసిన తర్వాత మనసులో ఏ మూలనో కాస్త డౌట్‌ ఉంటూ వచ్చింది. అది ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో 1’ మేకింగ్‌ ఫిల్మ్‌తో పూర్తిగా సంతృప్తి పడలేదు. 

కానీ తాజాగా విడుదలైన ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో 2’ మేకింగ్‌ వీడియో చూసిన వారు మాత్రం ప్రభాస్‌ పర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌ని ఎంచుకున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో నెవర్‌ బిఫోర్‌.. నెవ్వర్‌ ఎగైన్ అనే రీతిలో ఉంది. ముఖ్యంగా ప్రభాస్‌, శ్రద్దాకపూర్‌ల జంట కనువిందుగా ఉంది. యాక్షన్‌ సీన్స్‌, గన్‌ ఎలివేషన్స్‌ వంటివి అద్భుతంగా ఉన్నాయి. ఈ వీడియో కేవలం ఒక రోజులోనే కోటి వ్యూస్‌ సాధించడం ఖాయమనే చెప్పాలి. ఇక ‘సాహో’ మేకింగ్‌ వీడియోపై టాలీవుడ్‌ ప్రముఖులే కాదు.. బాలీవుడ్‌ విశ్లేషకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్‌లో మొదటి రోజునే 25 కోట్లకు పైగా కొల్లగొట్టగలిగిన చిత్రం అంటూ అప్పుడే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 

ఇక ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ 90కోట్లకు పైగా అమ్ముడయ్యాయని గతంలో వార్తలు వచ్చాయి. స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదలయ్యే అవకాశం ఉన్న ‘సాహో’ని మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ఆఫ్‌ 2019 అనే చెప్పాలి. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ వెర్షన్స్‌కి సంబంధించిన థియేటికల్‌ రైట్స్‌ని ఏకంగా 250కోట్లకు టీసిరీస్‌ ముందుకు వచ్చిందని అంటున్నారు. 

ఇంకా పలు రూపాలలో భారీ అమౌంట్స్‌ వచ్చే అవకాశం ఉంది. 225 కోట్లతో రూపొందుతున్నఈ చిత్రం థియేటికల్‌ హక్కులను 250కోట్లకు ఇచ్చేందుకు యువి క్రియేషన్స్‌ సంస్థ నో చెప్పిందట. ఏకంగా 350కోట్లకు బేరం పెట్టిందని సమాచారం. మరోవైపు ఈ చిత్రం ఓవర్‌సీస్‌ రైట్స్‌ని 45 కోట్లు చెబుతున్నారు. ఈ మొత్తానికి బేరం కుదిరితే ‘సాహో’ విదేశాలలో బాహుబలి స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టాల్సివస్తుంది. మరి పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఈ చిత్రం విడుదలకు ముందే ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచిచూడాల్సివుంది..! 

Saaho Business Creates Sensation:

Saaho team wants 350 crores for Movie Theatrical Rights  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ