స్వయంగా బాబాయ్ బాలయ్య, తమ్ముడు ఎన్టీఆర్‌లు ప్రమోషన్ చేయడంతో 118 చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఇక సినిమాలో కూడా మంచి మ్యాటర్ ఉండటంతో ఈ చిత్రం ఇప్పుడు హిట్టు దిశగా పయనిస్తుంది. ఇక రాబోయే చిత్రాలలో కేవలం వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మినహా ఏవి సరైన ఆసక్తిని క్రియేట్ చేయలేకపోతున్నాయి.
సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ నెల 10న జరగబోయే మా ఎన్నికలు మాత్రం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్, జయసుధల పోటీ తరహాలో యమరంజుగా ఈ పోరు ఉంటోంది. శివాజీ రాజా ప్యానల్‌కి చిరు మద్దతు ఉందనేది బహిరంగ సత్యం. నరేష్ బృందం చిరుని కలిసినా అది నామ్‌కే వాస్తే కలయిక మాత్రమే. అందునా నరేష్ ఏరికోరి మెగాహీరోలకు బద్ద శత్రువులైన రాజశేఖర్ దంపతులను తెరపైకి తెచ్చాడు. మరోవైపు నరేష్ ప్యానెల్‌కి మహేష్ నుంచి మద్దతు ఉంటుంది గానీ ఇలాంటి వ్యవహారాలంటే మహేష్‌కి పెద్ద ఆసక్తి ఉండదనే విషయం తెలిసిందే.
శివాజీరాజాకి వ్యతిరేకంగా రాజేంద్రప్రసాద్, మురళీమోహన్‌లు నరేష్‌కు మద్దతు ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయినా పెద్ద ఆర్టిస్టులు మాత్రం శివాజీ రాజా తరపునే ఉన్నారన్న సంకేతాలు అందుతున్నాయి. మరి ఈ పోటీలో శివాజీరాజా, నరేష్‌లలో ఎవరు విజయం సాధిస్తారు? అనే అంశం మాత్రం స్టార్స్ సినిమాల స్థాయిలో ఆసక్తిని రేపుతోందనేది వాస్తవం.