Advertisementt

మహేష్ కి ఎక్కనిది.. బన్నీకి ఎలా ఎక్కిందో..?!

Wed 06th Mar 2019 12:28 AM
sukumar,mahesh babu,allu arjun,mahesh out,allu arjun movie,confirm  మహేష్ కి ఎక్కనిది.. బన్నీకి ఎలా ఎక్కిందో..?!
Mahesh Out.. Allu Arjun in Sukumar Next Film మహేష్ కి ఎక్కనిది.. బన్నీకి ఎలా ఎక్కిందో..?!
Advertisement
Ads by CJ

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన సుకుమార్... సూపర్ స్టార్ మహేష్ ని ఇంప్రెస్స్ చెయ్యలేకపోయాడు. మహేష్ తో సినిమా అని అధికారికంగా మైత్రి వారు ప్రకటించినప్పటి నుండి.. దాదాపుగా రెండు మూడు స్టోరీ లైన్స్ ని సుకుమార్, మహేష్ కి వినిపించాడు. కానీ మహేష్ మాత్రం సుకుమార్ కథకి కనెక్ట్ కాలేకపోయాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ స్టోరీతో మహేష్ సినిమా సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. కానీ మహేష్ కి ఎక్కడో ఏదో డౌట్. అందుకే సుకుమార్ తో కథలు చెప్పించుకున్నాడు కానీ.. కమిట్ అవ్వలేకపోయాడు.

కానీ సుకుమార్ మాత్రం సైలెంట్ గా అల్లు అర్జున్ తో మీటింగ్స్ పెట్టాడు. ఎలాగూ ఆర్య, ఆర్య టు సినిమాలు బన్నీతో చేసాడు. ఇక మహేష్ కి చెప్పిన కథే అటు ఇటు మార్చి బన్నీకి వినిపించినట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే మహేష్ ఎర్రచందనం కథకే బన్నీ కనెక్ట్ అయ్యాడని.. మరి మహేష్ కి నచ్చని ఆ కథ బన్నీకి ఎలా నచ్చిందబ్బా... అంటూ మీడియా మిత్రులు దీర్ఘాలు తీస్తున్నారు. ఏదైనా సుకుమార్ మాత్రం మైత్రి మూవీస్ తో చేతులు కలిపి మహేష్ కి గట్టి దెబ్బే వేసాడు. ఇక మహేష్ తో సుకుమార్ సినిమా క్యాన్సిల్ విషయాన్నీ మహేష్ హడావిడిగా ట్వీట్ చేసాడు కూడా.

మరోపక్క సోషల్ మీడియాలో మహేష్ తో వన్ నేనొక్కడే సుకుమార్ లాస్ట్ సినిమా..  ఇక సుక్కుతో మహేష్ సినిమా ఉండకపోవచ్చు అంటూ కథలు కథలుగా గాసిప్స్ బయలుదేరాయి. ఇక అల్లు అర్జున్ మాత్రం తెలివిగా సుకుమార్ ని లైన్ లో పెట్టేసాడు. కాకపోతే సుకుమార్ ఏడాది నుండి మహేష్ సినిమా పై వర్క్ చేస్తున్నాడు. మరి ఆ వర్క్ మహేష్ కి ఉపయోగపడకపోయినా.. బన్నీకి పనికొస్తుంది కానీ.. మహేష్ ని మనసులో పెట్టుకుని చేసినది బన్నీకి ఎలా మారుస్తాడో సుకుమార్... చూద్దాం.

Mahesh Out.. Allu Arjun in Sukumar Next Film:

Allu Arjun Says Ok to Sukumar for His Next

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ