తన మ్యాథమెటిక్స్ లెక్కల్ని పక్కన పెట్టి తొలిసారి ప్రేక్షకుడికి ఫజిల్స్ పెట్టకుండా చేసిన చిత్రం `రంగస్థలం`. ఈ సినిమాతో రామ్‌చరణ్‌ని ఎక్కడో కూర్చోబెట్టిన సుక్కు ఈ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో మరోసారి మహేష్‌బాబుతో ప్రయోగం చేయాలనుకున్నాడు. నైజాం రజాకార్ కాలం నాటి కథతో మహేష్ ని మెప్పించాలని ప్రయత్నించాడు. కానీ వర్కవుట్ కాలేదు. నైజామ్ కథ అంటే దాన్ని అటెమ్ట్ చేయడానికి చాలా మంది హీరోలు భయపడ్డట్టే మహేష్ కూడా భయపడ్డడు. ఎందుకంటే నైజాం రజాకార్ కాలం నాటి కథ అంటే ముస్లిమ్స్‌కు సంబంధించిన పలు అంశాల్ని టచ్ చేయాల్సి వుంటుంది. ఏదైనా అటు ఇటైతే కాంట్రవర్సీలు కొదవుండదు.
ఇదే భయంతో సుక్కు చెప్పిన కథని మహేష్ రిజెక్ట్ చేశాడు. మళ్లీ మళ్లీ ఎన్ని మార్పులు చేసి చెప్పినా ససేమీనా అనడంతో చేసేది లేక సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తలుపుతట్టాడు. `రుద్రమదేవి`లో గోన గన్నారెడ్డి పాత్రని ఆడుకున్న అల్లు అర్జున్ అలాంటి పాత్రే ఫుల్ లెంగ్త్‌గా వుంటే వదులుకుంటాడా? చటుక్కున ఒపకపేసుకోడూ అదే చేశాడు. మహేష్ కాదన్న కథని అల్లు అర్జున్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేయడంతో సుక్కు ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌కు గ్రీసిగ్నల్ పడింది. ఈ రోజే ఈ చిత్రాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ హఠాత్పరిణామానికి వెంటనే తేరుకున్న మహేష్ సుక్కు, అల్లు అర్జున్‌ల ప్రాజెక్ట్ పై అదిరిపోయే ట్వీటేశాడు.
సుకుమార్‌కు నాకు క్రియేటీవ్ పరమైన విభేదాలు తలెత్తడం వల్లే ఇద్దరం కలిసి సినిమా చేయలేకపోయాం. అయితే ఆయన కొత్త చిత్రాన్ని ఈ రోజు ప్రకటించడం ఆనందంగా వుంది. ఒక ఫిల్మ్ మేకర్‌గా సుకుమార్ అంటే ఎప్పటికీ గౌరవిస్తాను.మా ఇద్దరి కాలయికలో వచ్చిన కల్ట్ క్లాసిక్ `వన్ నేనొక్కడినే`ఈ సినిమాకు సనిచేస్తున్నప్పుడు ప్రతి క్షణాన్ని చాలా ఎంజాయ్ చేశాను` అని మహేష్ చేసిన ట్వీట్ అదిరిందని అంతా అంటున్నారు. ఇదొక్కటి చాలు మహేష్ సమయస్ఫూర్తి గురంచి చెప్పడానికి.