ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Super star Mahesh Shelves Sukumar’s project

మహేష్-సుకుమార్ ఫిల్మ్ ఆగిపోయింది

Super star Mahesh Shelves Sukumar's project

మహేష్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఆగిపోయింది. అవును ఈ విషయాన్నీ మహేష్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసేసాడు. నిన్నటివరకు మహర్షి తర్వాత మహేష్, సుకుమార్ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడని.. సుకుమార్ గతంలో చెప్పిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ.. సుకుమార్ ఫ్రెష్ స్టోరీతో మహేష్ ని ఇంప్రెస్ చేసాడని.. సో మహర్షి తర్వాత సుకుమార్ తోనే మహేష్ మూవీ అని అన్నారు. ఇక సుకుమార్ తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ కూడా ప్రచారంలోకొచ్చింది. అయితే తాజాగా సుకుమార్ తో అల్లు అర్జున్ 20 అని అధికారిక ప్రకటన వచ్చేసేసరికి... మహేష్ - సుకుమార్ సినిమాపై అందరిలో అనుమానాలు మొదలైనాయి.

అయితే అవి అనుమానాలు కాదు నిజం. మహేష్ - సుకుమార్ మూవీ ఆగిపోయింది. మహేష్ తన ట్విట్టర్ ద్వారా... సుకుమార్- అల్లు అర్జున్ కాంబోకి ఆల్ ద బెస్ట్ చెప్పేసాడు. సుకుమార్ కి కంగ్రాట్స్ చెప్పడమే కాదు... తనకు సుకుమార్ కి మధ్య క్రియేటివ్ డిఫ్రెన్సెస్ ఉన్నాయని.. అయన మైండ్ సెట్ కి తన మైండ్ సెట్ కి తేడా ఉందని చెప్పిన మహేష్.... సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఇక సుకుమార్ సినిమాలను, ఆయన క్రియేటివిటీని తాను గౌరవిస్తానని.. అలాగే సుకుమార్ డైరెక్షన్ లో చేసిన వన్ నేనొక్కడే సినిమా వర్క్ విషయంలో ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేసానని.. మహేష్ ట్వీట్ చేసాడు. సో మహేష్ స్పందనతో సుకుమార్, మహేష్ కాంబోకి ఫైనల్ గా తెరపడిపోయింది.

Sukumar and Mahesh Babu Movie Latest Update

mahesh babu
sukumar
movie
latest update