మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈచిత్రం యొక్క టాకీ పార్టు త్వరలోనే పూర్తి కానుంది. కేవలం ఇంకా నాలుగు రోజులు షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అది కూడా త్వరలోనే అయిపోతుందని సమాచారం.
అయితే ఈ సినిమాకు సంబంధించి సీజీ మరియు విఎఫ్ ఎక్స్ వర్క్ చాలా నెమ్మదిగా సాగుతోందని చిరంజీవికి తెలియడంతో ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని అల్టిమేటం జారీ చేశారట. ఎంత కాదనుకున్న పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు అవ్వడానికి నాలుగు నెలలు పైనే పడుతుంది.
సో ముందుగానే అనుకున్నట్టు ఈ సినిమా ఆగస్టులో వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోస్ నటిస్తున్నారు. చిరు సరసన నయనతార నటించిన ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదీ సంగీతం అందిస్తున్నాడు.