Advertisementt

‘మహానటి’కి మరో ఛాలెంజింగ్‌ పాత్ర!

Mon 04th Mar 2019 04:10 PM
keerthi suresh,challenging role,bollywood offer  ‘మహానటి’కి మరో ఛాలెంజింగ్‌ పాత్ర!
One More Challenging Role to Keerthi Suresh ‘మహానటి’కి మరో ఛాలెంజింగ్‌ పాత్ర!
Advertisement
Ads by CJ

కీర్తిసురేష్‌.. ఎంతటి స్టార్‌ హీరోతోనైనా గ్లామర్‌షో లేకుండా తనదైన పద్దతిలో సాగుతోంది. గ్లామర్‌షోలు తన ఒంటికి సరిపోవని చెబుతూ వస్తోంది. ‘నేను..శైలజ’తో హిట్‌ కొట్టి గత ఏడాది సంచలన చిత్రంగా నిలిచిన మహానటి సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’లో సావిత్రి పాత్రకు పున:ప్రతిష్ట చేసింది. ఎంత టాలెంట్‌ ఉన్న నటులకైనా ఛాలెంజింగ్‌ పాత్రలు రాకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. మరి అది కీర్తిసురేష్‌ చేసిన తప్పిదమో, గ్రహచారమో గానీ ఆ తర్వాత ఆమె సత్తాకి నిలువుటద్దంగా నిలిచే పాత్రలు ఆమెకి రాలేదు. పవన్‌తో ‘అజ్ఞాతవాసి’, విశాల్‌తో ‘పందెంకోడి 2’, విక్రమ్‌తో ‘సామి స్క్వేర్‌’, సూర్యతో ‘గ్యాంగ్‌’ వంటి చిత్రాలు చేసింది. నిజానికి ‘మహానటి’ తర్వాత ఈ చిత్రాలన్ని ఆమె చేయాల్సిన చిత్రాలు కాదని ఘంటాపధంగా చెప్పవచ్చు. 

తాజాగా ఆమెకి తన సత్తాని చాటే పాత్ర వచ్చిందని, అది కూడా బాలీవుడ్‌ చిత్రమని సమాచారం. స్వర్గీయ శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మించే బాలీవుడ్‌ లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో కీర్తి నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందట. గత ఏడాది ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా వచ్చిన ‘బదాయిహో’ దర్శకుడు అమిత్‌శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బదాయిహో’లో ఎంతో క్లిష్టమైన లేట్‌ ఏజ్‌ ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్‌ని కూడా ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా చూపించిన అమిత్‌శర్మ దర్శకుడు కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం అవార్డులతో పాటు రివార్డులను కూడా గెలుచుకుంది. 

ఇక తాజా చిత్రంలో ‘మహానటి’ కీర్తిసురేష్‌ పాత్ర అద్భుతంగా ఉండటంతో ఆమె కూడా ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఎదురుచూస్తోంది. మరి కీర్తిసురేష్‌ తన బాలీవుడ్‌ ఎంట్రీలో అదరగొడితే విద్యాబాలన్‌ స్థానాన్ని ఈమె భర్తీచేయవచ్చన్నది బాలీవుడ్‌ టాక్‌. 

One More Challenging Role to Keerthi Suresh:

Bollywood Offer to Keerthi Suresh 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ