తమన్నా.. ‘హ్యాపీడేస్’తో బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకుని, వరుసగా యంగ్ హీరోలు, సీనియర్ స్టార్స్ సరసన కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఇంతకాలం లాంగ్ కెరీర్‌ని ఆమె సాధించడం నిజంగా ఘనతనే చెప్పాలి. ఇక ఈమె కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా నటించింది. కానీ బాలీవుడ్ ఆమెకి తీవ్రనిరాశనే మిగిల్చింది. గ్లామర్ విషయంలో ఈమె ఏమాత్రం సందేహించదు. దర్శకులు కోరిన విధంగా హాట్‌హాట్‌గా నటించేందుకు ఎప్పుడు సిద్దంగానే ఉంటుంది. అయితే ఈమె లిప్‌లాక్‌లకి మాత్రం చాలా దూరం. తను ఏ చిత్రం ఒప్పుకున్నా.. కిస్ సీన్స్ మాత్రం చేయనని తన అగ్రిమెంట్‌లో ఆమె పేర్కొంటుంది. దాని విషయంలో మాత్రం ఆమె అసలు రాజీ పడదు.
కానీ ఈమెకి బాలీవుడ్ కండలవీరుడు, ‘క్రిష్’ హృతిక్‌రోషన్ అంటే పిచ్చి ఇష్టమని తాజాగా తెలియజేసింది. ఎంతటి హీరో చిత్రంలోనైనా లిప్‌కిస్‌లను ఒప్పుకోను. అదే అదృష్టవశాత్తు నాకు బాలీవుడ్ స్టార్ హృతిక్‌రోషన్‌తో చాన్స్ వచ్చి, అందులో కిస్ సీన్ ఉంటే మాత్రం నా నిబంధనను వెనక్కి తీసుకుంటాను. హృతిక్ సరసన నటించడమే నా అదృష్టం. కాబట్టి ఆయన సినిమాలో అలాంటి సీన్స్ ఉన్నా వాటిని పట్టించుకోనని చెప్పుకొచ్చింది.
హృతిక్‌రోషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించడమే అదృష్టంగా భావిస్తాను. అలాంటిది ఆయనతో చాన్స్ వస్తే ఎలా నటించమన్నా కూడా నేను సిద్దమేనని చెప్పింది. ఇక పూజాహెగ్డేకి, హృతిక్‌రోషన్‌తో అతి తక్కువ చిత్రాలతోనే ‘మొహంజదారో’లో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం సమయంలో పూజా కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేసింది. మరి పూజాహెగ్డే తరహాలోనే తమన్నాకి అటు వంటి చాన్స్ వస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...!