Advertisementt

వేచి చూసింది ఇందుకోసమేనా షాలినీ..?

Mon 04th Mar 2019 12:54 PM
arjung reddy,heroine,shalini pandey,role,118 movie,kalyan ram  వేచి చూసింది ఇందుకోసమేనా షాలినీ..?
Arjung Reddy Heroine Shalini Pandey Role in 118 Movie వేచి చూసింది ఇందుకోసమేనా షాలినీ..?
Advertisement
Ads by CJ

అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే.. ఆ తర్వాత తెలుగులో కనబడితే ఒట్టు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ కిస్సులతో రెచ్చిపోయి నటించిన షాలిని పాండేకి ఆ సినిమా తర్వాత అలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చాన్సులే వచ్చాయట. కొందరు దర్శకనిర్మాతలైతే.. సినిమాలో అవసరం లేకపోయినా... లిప్ లాక్స్ చేస్తావా అని అడిగారని.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది కూడా. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత తెలుగులో బిజీ కాకపోవడానికి ఏకైక కారణం మాత్రం ఆమెకి అర్జున్ రెడ్డిలో చేసిన ఆ కేరెక్టర్స్ లాంటివి రావడమే అని చెప్పింది. ఇక మహానటిలో సావిత్రి ఫ్రెండ్ కేరెక్టర్ లో చేసిన.. ఆమెకి ఉపయోగం లేకుండా పోయింది.

అయితే అర్జున్ రెడ్డి, మహానటి వచ్చిన చానళ్లకు షాలిని పాండే కళ్యాణ్ రామ్ తో కలిసి 118 అనే థ్రిల్లర్ మూవీలో నటించింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గర్ల్ ఫ్రెండ్ గా షాలిని పాండే నటించింది. అయితే ఓ అన్నంత ప్రాధాన్యత లేని పాత్రలోనే షాలిని కనబడి.. అభిమానులను డిజప్పాయింట్ చేసింది. కేవలం కళ్యాణ్ రామ్ కు సపోర్టింగ్ పాత్రల్లో నటించిన షాలిని పాండే.. పాత్రకి ప్రాధాన్యత కనబడదు.

కాస్త బొద్దుతనం తగ్గితే కమర్షియల్ సినిమాలకు కూడా పనికి వస్తుంది అనేలా ఉంది. కేవలం ఆమె అందాలు చూపించడానికి పరిమితమైంది అనేలా ఉన్న ఈ పాత్రని ఒప్పుకున్నా షాలిని పాండేని అందరూ.. ఇలాంటి పాత్రల కోసమేనా ఇన్నాళ్లు వెయిట్ చేసింది అని అంటున్నారు. పాపం షాలిని క్యూట్ గా ఉంటే సరిపోదు... అదృష్టం కూడా ఉండాలమ్మడూ...!

Arjung Reddy Heroine Shalini Pandey Role in 118 Movie:

No Important to Shalini Pandey Role in 118

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ