తాజాగా కళ్యాణ్‌రామ్ ‘118’ విడుదలైంది. దీని తర్వాత ఇక పోటీ ఏప్రిల్ 5 నుంచి ఉండబోతోంది. నాగచైతన్య, సమంత ‘మజిలీ’, నాని ‘జెర్సీ’, లారెన్స్ ‘కాంచన సిరీస్ మూవీ’, సాయిధరమ్‌తేజ్ ‘చిత్రలహరి’.. ఇలా పలు చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఇక ఈ వేసవిలో వచ్చే ఒకే ఒక్క పెద్ద స్టార్ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి సంస్థలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. పూజాహెగ్డే మహేష్‌కి జోడీగా నటిస్తోన్న ఇందులో అల్లరి నరేష్ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. దీని తర్వాత ఇక ఆగష్టులో ‘సాహో’, ఆ తర్వాత ‘సై..రా’ వంటి చిత్రాలు రానున్నాయి.
ఇక విషయానికి వస్తే సెన్సేషనల్ రౌడీస్టార్‌గా పేరు తెచ్చుకుని సంచలనాలు రేకెత్తిస్తోన్న విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘అర్జున్‌రెడ్డి, గీతా గోవిందం, ట్యాక్సీవాలా’ చిత్రాలతో సంచలనం సృష్టించిన విజయ్ ‘డియర్ కామ్రేడ్’గా వస్తున్నాడు. ‘గీతాగోవిందం’లో తనకు జోడీగా నటించి మెప్పించిన రష్మికా మందన్నా మరోసారి విజయ్‌తో జోడీ కడుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న ఈ మూవీని మే 22న విడుదల చేయాలని భావిస్తున్నారట.
మైత్రి మూవీ మేకర్స్, విజయ్ దేవరకొండ, దర్శకుడు భరత్‌కమ్మలు ఇప్పటికే చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ని త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తే ఈ చిత్రం మే 22న సోలో రిలీజ్‌గా వచ్చే వీలుంటుంది. మరోవైపు ‘శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం’ వంటి వరుస ఇండస్ట్రీ హిట్స్‌ని కొట్టిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ‘సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటొని’లతో రెండు పరాజయాలు మూటగట్టుకుంది. కానీ రాబోయే రెండు నెలలలో వారు నిర్మించిన సాయిధరమ్‌తేజ్ ‘చిత్రలహరి’, విజయ్‌దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్‌కి కీలకంగా మారనున్నాయి.