Advertisementt

రకుల్ అవుట్.. టాప్ ప్లేస్‌లో ఈ భామే!

Sat 02nd Mar 2019 05:47 PM
pooja hegde,rakul preet singh,trivikram,allu arjun,top place  రకుల్ అవుట్.. టాప్ ప్లేస్‌లో ఈ భామే!
Star Heroine in Tollywood Top Place రకుల్ అవుట్.. టాప్ ప్లేస్‌లో ఈ భామే!
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే. మొదట ఆమె నాగచైతన్య సరసన ఒక లైలా కోసం, వరుణ్‌తేజ్‌ మొదటి చిత్రంగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుందా చిత్రాలలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఆమెకి ఎలాంటి గుర్తింపును తేలేకపోయాయి. అదే సమయంలో హృతిక్‌రోషన్‌తో బాలీవుడ్‌లో ‘మొహంజదారో’లో చేస్తే అది కూడా డిజాస్టర్‌ అయింది. ఎట్టకేలకు ఆమెకి అల్లుఅర్జున్‌-హరీష్‌శంకర్‌-దిల్‌రాజుల కాంబినేషన్‌లో రూపొందిన డిజె (దువ్వాడ జగన్నాధం) చిత్రం కమర్షియల్‌గా సక్సెస్‌నిచ్చింది. రామ్‌చరణ్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చి నాన్‌-బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన ‘రంగస్థలం’లో జిల్‌ జిగేల్‌ రాణి అంటూ ఐటం సాంగ్‌తో మెప్పించింది. శ్రీవాస్‌-బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ల సాక్ష్యంలో నటిస్తే అది కూడా ఫ్లాప్‌ అయింది. ఎట్టకేలకు ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల అరవింద సమేత వీరరాఘవతో తన సత్తా చాటింది. 

ప్రస్తుతం ఆమె మహేష్‌బాబు హీరోగా దిల్‌రాజు, అశ్వనీదత్‌, పివిపిల భాగస్వామ్యంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న మహేష్‌ ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’లో నటిస్తోంది. మరోవైపు ప్రభాస్‌ సరసన ‘జిల్‌’ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా ఈమెనే హీరోయిన్‌. ఇక ‘మొహంజదారో’ డిజాస్టర్‌ తర్వాత మరోసారి బాలీవుడ్‌లో తన లక్‌ని పరీక్షించుకుంటోంది. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘హౌస్‌ఫుల్‌ 4’లో హీరోయిన్‌గా నటిస్తోంది. 

మరోవైపు బన్నీ-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల హ్యాట్రిక్‌ మూవీలో చోటు దక్కించుకుంది. ఈ చిత్రానికిగాను ఆమె రెండు కోట్ల పారితోషికం అందుకుంటోందని సమాచారం. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న చిత్రాలు విజయం సాధిస్తే టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా ఈమె దశ తిరగడం ఖాయమనే చెప్పాలి. అలా జరిగితే ఆమె రెమ్యూనరేషన్‌ మరింతగా పైకి ఎగబాకడం ఖాయం. మరి టాలీవుడ్‌లో రకుల్ స్థానాన్ని పడేసి.. టాప్ హీరోలందరితో సినిమాలు చేస్తున్న ఈమె టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది. 

Star Heroine in Tollywood Top Place:

Pooja Hegde in Allu arjun and Trivikram Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ