శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం ఇలా వరుస ఇండస్ట్రీ హిట్స్ సాధించిన అభిరుచి కలిగిన నిర్మాణ సంస్థ మైత్రిమూవీమేకర్స్. కానీ ఆ తర్వాత వీరు చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, మాధవన్‌లతో తీసిన సవ్యసాచి, రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో చేసిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలు దారుణమైన ఫలితాలను చవిచూశాయి. ప్రస్తుతం మైత్రి సంస్థ పలువురు మీడియం రేంజ్ హీరోలతో చిత్రాలను నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న కాంబినేషన్‌లో భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం వేసవి చివరి చిత్రంగా మే 25న విడుదల కానుంది. ఇక వీరు వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతోన్న మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కిషోర్‌తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రవితేజ హీరోగా సంతోష్‌శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.
ఇక మెగా కాంపౌండ్ హీరో ‘పంజా’ వైష్ణవ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో బుచ్చిబాబు డైరెక్షన్‌లో మరో చిత్రం రూపొందుతోంది. తాజాగా మైత్రి మూవీమేకర్స్‌సంస్థ మరో మెగా హీరో, మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో ఓ చిత్రం చేయనుంది. వీరు మొదట్లో ‘తొలిప్రేమ, మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ చిత్రం చేయాలని భావించినా, ‘మిస్టర్ మజ్ను’ ఘోరపరాజయంతో దానిని వాయిదా వేశారు.
తాజాగా ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వరుణ్‌తేజ్ హీరోగా ఆ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఈ స్టోరి వరుణ్‌తేజ్‌కి కూడా బాగా నచ్చడంతో ఓకే చెప్పాడని సమాచారం. జూన్ నుంచి దీని షూటింగ్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వరుణ్‌తేజ్, హరీష్‌శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకీ’, కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ విధంగా చూసుకుంటే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటికే రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, వరుణ్‌తేజ్‌లతో సినిమాలు చేస్తూ రాబోయే రోజుల్లో మిగిలిన మెగాహీరోలందరితో ఓ రౌండ్ వేయాలని భావిస్తున్నారట..!