Advertisementt

‘సాహో’ స్పెషల్ శ్రద్ధాకపూర్ కోసం

Sat 02nd Mar 2019 11:55 AM
prabhas,shraddha kapoor,birthday,shades of saaho-chapter2,teaser,release,march 3  ‘సాహో’ స్పెషల్ శ్రద్ధాకపూర్ కోసం
Shades of Saaho - Chapter 2: New teaser of Prabhas to Release as Shraddha Kapoor’s Birthday gift ‘సాహో’ స్పెషల్ శ్రద్ధాకపూర్ కోసం
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో - 2 విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సాహో. ఈ భారీ యాక్షన్ విజువల్ ఎంటర్‌టైనర్‌లో బాహుబలి ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. యు.వి.క్రియేష‌న్స్ అధినేత‌లు వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ నిర్మాత‌లుగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్నాడు. గతంలో యంగ్ హీరో శర్వానంద్‌తో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌లో రన్ రాజా రన్ అనే బ్లాక్ బస్టర్ ని తెలుగు ప్రేక్షకులకు సుజిత్ అందించాడు. అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారతదేశంలో ఉన్న సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ - 1 పేరిట గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిత్ర బృందం, ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ సాహోలో హీరోయిన్ గా నటిస్తున్న శద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 3న షేడ్స్ ఆఫ్ సాహో - 2 నీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో - 2 కి సంబంధించిన కౌంట్ డౌన్ టీజర్స్ కి మీడియాలో, అటు అభిమానుల్లో ఫుల్ క్రేజ్ లభించింది. హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ త్రయం శంకర్ ఇషాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ మిర్చి సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హరించిన మ‌ధి, సాహోని విజువ‌ల్ ఫీస్ట్ గా మార్చేందుకు కృషి చేస్తున్నారు.

Shades of Saaho - Chapter 2: New teaser of Prabhas to Release as Shraddha Kapoor’s Birthday gift:

Prabhas ‘Shades of Saaho-Chapter2’ Teaser to Release on March 3

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ