Advertisementt

బాలయ్యను ఫ్యాన్సే తట్టుకోలేకపోతున్నారా..?

Fri 01st Mar 2019 07:46 PM
balakrishna,mokshagna,entry,nandamuri balakrishna,ntr biopic,flops  బాలయ్యను ఫ్యాన్సే తట్టుకోలేకపోతున్నారా..?
Nandamuri Fans Wants Mokshagna Entry బాలయ్యను ఫ్యాన్సే తట్టుకోలేకపోతున్నారా..?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ‌కి ప్లాప్స్ కొత్తేమీ కాదు. తన కెరీర్ స్టార్టింగ్ లోనే ఎన్నో ఎన్నో డిజాస్టర్స్ చూసాడు. ఆ టైములో కూడా బాలయ్య నిరుత్సాహపడలేదు. ఆ తర్వాత మహారథి, ఒక్కమగాడు, పాండురంగడు లాంటి డిజాస్టర్ సినిమాలు తరువాత బోయపాటి వచ్చి బాలయ్యకు సూపర్ హిట్ చిత్రం సింహా ఇచ్చాడు. ఆ టైములో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు.

సింహా తరువాత రెండు మూడు డిజాస్టర్స్ వచ్చిన కుంగిపోలేదు. వెంటనే మళ్లీ బోయపాటి లెజెండ్ సినిమాతో ఇంకో హిట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా తరువాత చేసిన సినిమాలు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే రీసెంట్ గా వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో ఇంకా బాలయ్య ని తట్టుకోవడం కష్టమే అని అర్ధం అయిపోయింది. ముఖ్యంగా ఈసినిమాలను సామాన్య ప్రేక్షకుల కంటే ముందు నందమూరి అభిమానులే తిరస్కరించారు.

ఇది ఎన్టీఆర్ బయోపిక్ అయినప్పటికీ, నందమూరి అభిమానులు మహానాయకుడ్ని పట్టించుకోకపోవడంతో బాలయ్య కెరీర్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఇంకా బాలయ్య సినిమాల నుండి తప్పుకుని తన కొడుకుని రంగంలోకి దింపితే బెటర్ అని సలహాలు వినిపిస్తున్నాయి. మరి ఇవి బాలయ్య పటించుకున్నట్టు కనిపించలేదు. ప్రస్తుతం బాలయ్య తన నెక్స్ట్ చిత్రాన్ని బోయపాటితో ప్లాన్ చేసుకున్నాడు. ఎన్నికలు తరువాత ఈ చిత్రం స్టార్ట్ కానుంది. చూద్దాం బాలయ్య ఈ సినిమాతో అన్న బౌన్స్ బ్యాక్ అవుతాడేమో...

Nandamuri Fans Wants Mokshagna Entry:

Audience Reaction on Balayya Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ