Advertisementt

ఎన్టీఆర్‌తో మిస్సయింది.. కళ్యాణ్ రామ్ ఇస్తాడా?

Fri 01st Mar 2019 07:39 PM
kalyan ram,118,nivetha thomas,jr ntr,jai lava kusa,118 movie  ఎన్టీఆర్‌తో మిస్సయింది.. కళ్యాణ్ రామ్ ఇస్తాడా?
Missed with NTR.. Waiting for Kalyan Ram ఎన్టీఆర్‌తో మిస్సయింది.. కళ్యాణ్ రామ్ ఇస్తాడా?
Advertisement
Ads by CJ

జెంటిల్‌మెన్ సినిమాతో టాలీవుడ్ కి దూసుకొచ్చిన క్యూట్ అండ్ షాట్ హీరోయిన్ నివేదా థామస్.. ఆ సినిమాతో హిట్ కొట్టడమే కాదు.. ఆ సినిమా తర్వాత ఎక్కడికో వెళుతుంది అనుకున్నారు. ఎందుకంటే నిత్యామీనన్‌లా పొట్టిగా గట్టిగా అద్భుతమైన నటనతో నివేదా థామస్ అబ్బుర పరిచింది. జెంటిల్‌మెన్‌లో నానికి ఎంతగా మార్కులు పడ్డాయో... నివేదకి అన్నే మార్కులు పడ్డాయి. ఇక నిన్నుకోరి సినిమాలో కూడా అదిరిపోయే నటనతో అదరగొట్టేసింది. నానికి లవర్ గా.. ఆది పినిశెట్టికి భార్యగా నివేదా నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మంచిగా మీడియం రేంజ్ హీరోలతో నటిస్తూ.. టాప్ లేవల్లోకి వెళ్ళాల్సింది పోయి... యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన చిన్నపాటి రోల్ దొరికేసరికి ఓకే చెప్పేసింది.

ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాలో నివేద వన్ ఆఫ్ హాఫ్ ద హీరోయిన్ గా నటించింది. నివేదా ఆ సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ రోల్ మాత్రం చెయ్యలేదు. జై లవ కుశ లో సెకండ్ హాఫ్‌లో నివేదా కేరెక్టర్ కనిపిస్తుంది. కాస్త గ్లామర్‌గా కనిపించినప్పటికీ.. ఎన్టీఆర్ సరసన నివేదా తేలిపోయింది. ఇక జై లవ్ కుశ  సినిమా హిట్లో కేవలం ఒక్క ఎన్టీఆర్‌కి తప్ప మరే ఇతర కేరెక్టర్ కి కానీ, దర్శకునికి గానీ పేరు రాలేదు. ఇక జై లవ కుశ దెబ్బకి నివేదా టాలీవుడ్ నుండి మాయమై మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్‌తో 118 అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కళ్యాణ్ రామ్ - నివేదా థామస్ - షాలిని పాండే కలిసి నటించిన 118.. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా కథ మొత్తం నివేదా థామస్ చుట్టూనే తిరుగుతుందని.... 118 ట్రైలర్ లోనే తెలిసింది. ఇక షాలిని పాండే.. కళ్యాణ్ రామ్ కి ఫియాన్సీ కేరెక్టర్ లో కనిపిస్తుంటే.. సినిమా కథలో నివేద కీలకం అంటున్నారు. మరి తమ్ముడు ఎన్టీఆర్.. జై లవ కుశ‌తో ఎలాంటి గుర్తింపును ఇవ్వని పక్షంలో.. అన్న కళ్యాణ్ రామ్ 118 తో ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

Missed with NTR.. Waiting for Kalyan Ram:

Nivetha Thomas Hopes on Kalyan Ram 118 Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ