Advertisementt

జక్కన్నని ఆకాశానికి ఎత్తేస్తోంది.. అందుకేనా?

Thu 28th Feb 2019 10:23 PM
ss rajamouli,tamanna,praises,baahubali,avanthika,jakkanna,ss rajamouli film,rrr  జక్కన్నని ఆకాశానికి ఎత్తేస్తోంది.. అందుకేనా?
Baahubali Avanthika Praises Director Rajamouli జక్కన్నని ఆకాశానికి ఎత్తేస్తోంది.. అందుకేనా?
Advertisement
Ads by CJ

మిల్కీబ్యూటీ తమన్నా.. ఎన్నో చిత్రాల తర్వాత శేఖర్‌కమ్ముల ‘హ్యాపీడేస్‌’ చిత్రంతో తన సత్తా చాటుకుంది. యంగ్‌స్టార్స్‌ సరసన కూడా నటిస్తూ వచ్చింది. తాజాగా సీనియర్‌ స్టార్స్‌కి కూడా ఓకే చెబుతోంది. కోలీవుడ్‌లో ప్రభుదేవాతో పాటు పలువురి చిత్రాలలో నటించింది. బాలీవుడ్‌కి కూడా వెళ్లి తన అదృష్టం పరీక్షించుకుంది. కానీ బాలీవుడ్‌లో ఈమె నటించిన ‘హిమ్మత్‌వాలా’, ‘షమ్‌షకల్స్‌’ చిత్రాలు డిజాస్టర్‌ అయ్యాయి. బ్యాడ్‌టైమ్‌ వచ్చినప్పుడల్లా అదృష్టం కొద్ది ఓ మంచి చాన్స్‌ని, అవకాశాన్ని దక్కించుకుంటూ ఇంకా కెరీర్‌ని కొనసాగిస్తోంది. ఈ తరం హీరోయిన్లలలో తనకి తమన్నాతో కలిసి డ్యాన్స్‌ చేయాలని ఉందని ఏకంగా మెగాస్టారే చెప్పాడు. ఆయనతో ‘ఖైదీనెంబర్ ‌150’లో చాన్స్‌ వస్తుందని పలువురు భావించారు. కానీ ఆ పాత్రని కాజల్‌ ఎగరేసుకుపోయింది. 

అయినా రామ్‌చరణ్‌, పవన్‌కల్యాణ్‌ వంటి వారితో జోడీ కట్టింది. ఈమె బాగా బ్యాడ్‌ కెరీర్‌ని ఎదుర్కొంటున్న సమయంలో రాజమౌళి దర్శకత్వంలో దేశ విదేశాలలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ చిత్రంలో అవంతిక పాత్ర ఆమెని మరలా బిజీని చేసింది. ఈ పాత్ర సినిమాకి ఏరకంగానూ ఉపయోగపడలేదని నాడు విమర్శలు వచ్చాయి. ‘బాహుబలి’లో ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్ర ఆమెదే అని విమర్శలు అన్నారు. దాంతో రాజమౌళిపై అలిగిందో ఏమో గానీ పెద్దగా ఈ చిత్రం ప్రచారంలో ఆమె యాక్టివ్‌గా పాల్గొనలేదు. 

ఇక తాజాగా తనకు బ్యాడ్‌ టైంలో చాన్స్‌ ఇచ్చిన దేవుడు... రాజమౌళి గారు పిలిచి వేషం ఇస్తానంటే ఏదో అతిధిపాత్ర అనుకున్నాను గానీ ఇంత మంచి పాత్ర అని అనుకోలేదంటూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తోంది. ఇక ప్రస్తుతం ఈమె మెగాస్టార్‌ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘సై..రా...నరసింహారెడ్డి’లో ఓ కీలకపాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమెతో పాటు నయనతార, కొణిదెల నిహారికలు సైతం ఇందులో నటిస్తున్నారని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజమో వేచిచూడాలి. 

ఇక రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అనే భారీ మల్టీస్టారర్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు హీరోయిన్లతో పాటు మరో కీలకపాత్ర కూడా ఉంటుందని సమాచారం. బహుశా ఆ పాత్ర కోసమే జక్కన్నను పనిగట్టుకుని ఆమె పొగిడేస్తోందా? అనే అనుమానాలు మాత్రం అందరిలో ఉన్నాయి. 

Baahubali Avanthika Praises Director Rajamouli:

Suddenly Tamanna Praised Rajamouli for RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ