జనవరిలో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలు, చిన్న చిత్రాలు అన్ని ఎఫ్ 2 హావాలో కొట్టుకుపోయాయి. జనవరి నెల మొత్తంలో కేవలం కామెడీ ఎంటరైనర్ ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా ఒక్కటే భారీ హిట్ అయ్యింది. మిగతా సినిమాలేవీ యావరేజ్ బోర్డర్ దాటలేకపోయాయి. ఇక ఈ నెల ఫిబ్రవరి పరిస్థితి కూడా అంతే. ఫిబ్రవరిలో విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఫిబ్రవరిలో రెండు పొలిటికల్ సినిమాలు భారీగా విడుదలైనప్పటి.. ప్రేక్షకులకు ఆ సినిమాలేవీ రుచించలేదు. ఒక్క సినిమా కూడా ప్రేక్షకులకు మెచ్చేవిగా కనబడలేదు.
ఫిబ్రవరి 8న రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా ఆయన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే తీసుకుని.. మహి వి రాఘవ్ యాత్ర సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమాకి హిట్ టాకొచ్చిన... పొలిటికల్ బయోపిక్ కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కాకపోతే నిర్మాతలకు లాస్ అయితే రాలేదు. ఇక ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజునాడు.. కాస్త అంచనాలతో విడుదలైన కార్తీ - రకుల్ ప్రీత్ ల దేవ్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అలాగే లవర్స్ డే అంటూ ప్రియా ప్రకాష్ కూడా బోల్తా పడింది. ఇక ఫిబ్రవరి 22 న మంచి అంచనాలతో విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు అయితే పరిస్థితి దారుణంగా వుంది. ఆ సినిమాతో పాటుగా విడుదలైన 4 లెటర్స్, మిఠాయి సినిమాలు అట్టర్ ప్లాప్ కాగా. డబ్బింగ్ సినిమాగా వచ్చిన నయనతార అంజలి సిబిఐ కి హిట్ టాకొచ్చిన.. ప్రమోషన్స్ లేక థియేటర్స్ వెలవెలబోయాయి.
మరి ఈ ఏడాది మొదలై అప్పుడే రెండు నెలలు గడిచిపోయినా.. ప్రేక్షకులు మెచ్చే సినిమాలేమి థియేటర్స్ లోకి మాత్రం రావడం లేదు. అసలే పిల్లలంతా ఎగ్జామ్స్ మూడ్ లో ఉన్నారు. దానికి తగ్గట్టే థియేటర్స్ దగ్గర పాప్ కార్న్ అమ్ముకునేవాళ్ళు కూడా ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి. మరి జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు సినీ లవర్స్ కి మహా బోర్.... మరి ఈ మార్చి అయినా ప్రేక్షకులను మెచ్చే సినిమాలేమన్న అందిస్తుందేమో చూడాలి. ఇక మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కళ్యాణ్ రామ్ - నివేత థామస్, షాలిని పాండేల 118 సినిమా మీద ప్రేక్షకుల ఆశలు పెట్టుకుని ఉన్నారు.