చిత్రీకరణ తుది దశలో సూపర్‌స్టార్ మహేష్ `మహర్షి` ... ఏప్రిల్ 25న విడుదల
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మార్చి 15నాటికి రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తవుతుంది. మరో వైపు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణం నటిస్తోన్న ఈ 'మహర్షి' చిత్రం హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోంది.
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.