హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు ఇటీవల హార్ట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. గత కొంత కాలంగా యువ కమెడియన్‌ల తాకిడీ, అత్యధిక శాతం పారితోషికం డిమాండ్ చేయడం వంటి కారణాలతో బ్రహ్మానందంకు సరైన ఆఫర్‌లు రావడం లేదు, అయతే కొంత విరామం తరువాత ఆయన మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. మళ్లీ వరుసగా సినిమాలు చేయబోతున్నారు.
గత కొన్ని నెలలుగా తన స్థాయికి తగ్గ రీతిలో సినిమాలు చేయని బ్రహానందం ఈ ఏడాది వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడపాలనుకుంటున్నారట. తనకు రెస్ట్ అవసరం లేదని చెబుతున్న ఆయన చేసే పనిలోనే నాకు కావాల్సినంత ఎనర్జీ వస్తుందని, ఇక విశ్రాంతి నాకు అవసరం లేదని చెబుతున్నారట. ముంబైలో బ్రహ్మానందం హార్ట్ ఆపరేషన్ పూర్తి చేసుకుని క్షేమంగా హైదరాబాద్ చేరుకున్న తరువాత నుంచి పలువురు క్రేజీ హీరోలతో పాటు పలువురు కమెడియన్స్ బ్రహ్మానందాన్ని కలిసి మనోధైర్యాన్ని అందించారు.
`బ్రహ్మానందం త్వరగా కోలుకుంటున్నారని, త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని క్రేజీ కమెడియన్ వెన్నెల కిషోర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించడం పలువురిని ఆకట్టుకుంటోంది. వెన్నెల కిషోర్ చెప్పినట్టుగానే వచ్చే నెలలో ఓ సినిమాకు బ్రహ్మానందం వర్క్ చేయబోతున్నారు. అది త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ ల సినిమానే అయివుంటుందని, త్రివిక్రమ్ తన చిత్రాల్లో బ్రహ్మానందంకు ఓ పాత్రని ఖచ్చితంగా వుండేలా చూసుకుంటున్నారు. ఆ కోవలోనే అల్లు అర్జున్ చిత్రంలో బ్రహ్మానందం నటించే అవాకశం ఎక్కువగా వుందని తెలుస్తోంది.