Advertisementt

‘నేను నా నాగార్జున’ అంటున్న మహేష్

Wed 27th Feb 2019 02:35 PM
comedian mahesh,hero,nenu naa nagarjuna,movie,first look,tsr,release  ‘నేను నా నాగార్జున’ అంటున్న మహేష్
Rangasthalam Mahesh turns Hero ‘నేను నా నాగార్జున’ అంటున్న మహేష్
Advertisement
Ads by CJ

‘రంగ‌స్థ‌లం’ ఫేమ్ మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న ‘నేను నా నాగార్జున’ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆవిష్క‌రించిన క‌ళాబందు డా.టి.సుబ్బ‌రామిరెడ్డి

‘రంగ‌స్థ‌లం’ ఫేమ్ మ‌హేష్, సోమివ‌ర్మ  జంట‌గా న‌టిస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ‘నేను నా నాగార్జున’. ఆర్‌.బి.గోపాల్ దర్శ‌క‌త్వంలో గుండ‌పు నాగేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, క‌ళాబందు డా టి.సుబ్బ‌రామిరెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..

డా. టి.సుబ్బ‌రామిరెడ్డి మాట్లాడుతూ - ‘‘సినిమా ఆద్యంతం కామెడీగా ఉంటుంది. నిర్మాత నాగేశ్వ‌ర‌రావుగారు ఈ చిత్రంలో నాగార్జున‌గారి అభిమానిగా, కీల‌క పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. నాగార్జున‌ గారిపై అభిమానాన్ని, గౌర‌వాన్ని తెలియ‌జేసేలా ఈ సినిమాను నిర్మించారు. డైరెక్ట‌ర్ ఆర్‌.బి.గోపాల్ సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. మహేష్ హీరోగా న‌టిస్తున్న చిత్ర‌మిది. అలాగే సోమివ‌ర్మ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంది. వీరిద్ద‌రు స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

నిర్మాత గుండ‌పు నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ - ‘‘సినిమాను నిర్మిస్తూనే .. చాలా కీల‌క‌మైన పాత్ర‌లో నటించాను. డైరెక్ట‌ర్ ఆర్‌.బి.గోపాల్‌ గారు అనుకున్న స‌మ‌యంలో సినిమాను ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేశారు. మ‌హేష్‌, సోమివ‌ర్మ చ‌క్క‌గా న‌టించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఎంట‌ర్‌టైనింగ్ మూవీ. విశాఖ ప‌ట్నం వాసినైన నేను విశాఖ ప‌ట్నంలోనే షూటింగ్ చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది’’ అన్నారు. 

మ‌హేష్‌, సోమివ‌ర్మ హీరో హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:  నాగార్జున‌, సంగీతం:  ఈశ్వ‌ర్ పెర‌వ‌లి, నిర్మాత‌:  గుండ‌పు నాగేశ్వ‌ర‌రావు, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.బి.గోపాల్‌.

Rangasthalam Mahesh turns Hero:

Comedian Mahesh Turns Hero with Nenu Naa Nagarjuna Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ