Advertisementt

24లో ఇన్ని ఉన్నాయా నాని..!!

Tue 26th Feb 2019 04:20 PM
hero nani,nani 24,special,vikram k kumar,mytri movie makers  24లో ఇన్ని ఉన్నాయా నాని..!!
So Many Specials to Nani 24 24లో ఇన్ని ఉన్నాయా నాని..!!
Advertisement
Ads by CJ

గత ఏడాది ‘కృషార్జునయుద్దం, దేవదాస్‌’లతో పెద్దగా మెప్పించలేకపోయిన నాని తాజాగా గౌతమ్‌ తిన్ననూరు దర్శకత్వంలో ‘జెర్సీ’ ద్వారా వస్తున్నాడు. ఇందులో నాని వయసు మీరిన వయసులో పట్టుదలతో కృషి చేసి క్రికెట్‌ ప్లేయర్‌ అయ్యే పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు అదే తేదీన నాగచైతన్య-సమంతలు పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న ‘మజిలీ’ని కూడా షెడ్యూల్‌ చేసి ఉన్నారు. ఇందులో కూడా చైతు క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఈ రెండు చిత్రాల దర్శకులకు ఇది ద్వితీయ చిత్రమే కావడం విశేషం. గౌతమ్‌ తిన్ననూరు ‘మళ్లీనువ్వే’, శివానిర్వాణ ‘నిన్నుకోరి’ చిత్రాలతో మెప్పించారు. అయితే ‘మహర్షి’ వాయిదా పడితే మాత్రం ‘కాంచన’, ‘చిత్రలహరి’తో పాటు ‘జెర్సీ, మజిలీ’ చిత్రాల రీషెడ్యూల్‌ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

ఇక తాజాగా నాని 24వ చిత్రం కూడా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అనౌన్స్‌ చేశారు. మైత్రి మూవీమేకర్స్‌ నిర్మిస్తోన్న ఈచిత్రానికి గతంలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ అనే టైటిల్‌ని పెట్టారు. ఇక తాజాగా నాని తనకి ‘24’ అంకెతో ఉన్న ప్రాధాన్యాన్ని వివరించాడు. తాను విక్రమ్‌ కె కుమార్‌తో చేయబోయేది తనకి 24వ చిత్రం అని, గతంలో విక్రమ్‌ కె కుమార్‌ ‘24’ అనే టైటిల్‌తో సూర్యతో ఓ చిత్రాన్ని తీశాడని తెలపడమే కాదు.. తనకి 24తో ఉన్న అనుబంధం గురించి చెబుతూ, నా పుట్టినరోజు ఫిబ్రవరి 24. నేను ఎప్పుడు ట్రైన్‌ టిక్కెట్‌ లేదా ఫ్లైట్‌ టిక్కెట్‌ కొన్నా ఎక్కువ సార్లు యాదృచ్చికంగా 24వ నెంబర్‌ సీటు వచ్చేది. అలాగే ఇల్లు కొంటే నా ఫ్లాట్‌ నెంబర్‌ 24 రావడంతో ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇక నేను పనిచేస్తోంది 24శాఖలున్న సినిమా ఇండస్ట్రీలో. నా కెరీర్‌ స్టార్ట్‌ అయింది 24 ఏళ్ల కిందట. దాంతో నా కారు నెంబర్‌ కూడా 24వచ్చేలా చూసుకున్నాను. ఇలా నాకు 24తో అవినాభావ సంబంధం ఉందని అనిపిస్తోందని తెలిపాడు. 

మరోవైపు ఆమధ్య నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి మరోసారి నానిని టార్గెట్‌ చేసింది. ‘మా ఊర్లో నాని అనే వాడు ఉన్నాడు. వాడు ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిలు కనిపిస్తే చాలు వాడు దారుణంగా ప్రవర్తిస్తాడు. తాగుడుతో పాటు వాడికి డ్రగ్స్‌ అలవాటు కూడా ఉంది. గతంలో ఆయన ఆవిడ మీడియా ముందుకు వచ్చి వాటిని ఖండించింది. ఆమె కూడా ఆడది కావడం వల్ల ఊరుకున్నాను. లేదంటే ఆవిడను రోడ్డుమీదకి ఈడ్చే దానిని’ అని కామెంట్స్‌ చేసి మరోసారి సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. 

So Many Specials to Nani 24:

Nani 24 Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ